సింహాచలం సింహగిరిపై కరోనా అవగాహన సదస్సు in Visakhapatnam,Vizagvision….విశాఖ సింహాచలం సింహగిరిపై కరోనా అవగాహన సదస్సు దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధమ హాస్పిటల్ వైద్యులు కరోనా వైరస్ పై భక్తులకు, అర్చకులకు సదస్సు నిర్వహించారు. కరోనా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా అర్చకులు దేవస్థాన ఉద్యోగులు మాస్కులు వేసుకోవాలని వైద్యులు తెలిపారు. కరుణ వైరస్ కి ప్రభుత్వ ఇంకా వ్యాక్సిన్ కొనుక్కోవడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన డాక్టర్లు కల్పించారు.
ప్రధమ హాస్పిటల్ వైద్యులు చేత అర్చకులకు ఉద్యోగస్తులకు శానిటేషన్ సిబ్బంది కి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచమంతా వణికిస్తున్న కరోనా వ్యాధిపై సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టంగా వైరస్ సోకకుండా ముందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
భక్తులు రద్దీగా ఉండే క్యూలైన్లో , నిత్య అన్నదాన సత్రం, ప్రసాదం క్యూలైన్లలో, దేవస్థానం ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య బృందం చే నిరంతరం శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు.ఎక్కడికక్కడ శాని టైజర్స్, డెటాల్, ఏర్పాటు చేసి వైరస్ సోకకుండా నివారణ చర్యలు చేపట్టామన్నారు.వృద్ధులు, 12 సంవత్సరాల లోపు పిల్లలు, అప్పన్న స్వామి దర్శనం వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.దేవస్థానం చేత నిర్వహించిన ప్రధాన ఉత్సవాలు, మరియు పూజాది కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలు అన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించ మని భక్తుల్ని దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వర్లు కోరారు. కరోనా వైరస్ నిర్మాణం చేయడానికి
వరాహ నరసింహస్వామి మాల మంత్రం 32 బీజాక్షరాలు కరోనా వ్యాధి ప్రభలించకుండా 32 రోజుల పాటు నరసింహం హోమాన్ని ఈవో ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు అర్చకులు తెలిపారు.

















