TDP Ayyanna Patradu Comments on CM Jagan in Visakhapatnam,Vizagvision…ఎన్నికల కమిషన్ నిర్ణయం అభినందనీయం: 37సం.నుంచి ఎలక్షన్ లు చూశాను. ఇంత దౌర్భాగ్య ఎన్నికల ఎప్పుడూ చూడలేదు. జగన్మోహనరెడ్డి ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. రాజ్యాంగం పోటీ చేసే ఓటు వేసే హక్కు ప్రజలకు ఇచ్చింది. ముఖ్యమంత్రి కి వున్న అధికారులు ఏమిటి. ఎన్నికల కమిషన్ అధికారులు ఏమిటి తెలుసా జగన్మోహనరెడ్డి కి. ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాడా. ఒక గూండాలా మాట్లాడారు. నువ్వే ముఖ్యమంత్రి వి. సిఎం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో వుంటాడన్న విషయం తెలియదా. జగన్మోహనరెడ్డి కోపం బాడీ లాంగ్వేజ్ చూశాను. దౌర్జన్యం చాలా దారుణం. మంత్రులు ఎమ్మెల్యే లు విజయసాయి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇంత దౌర్జన్యం గతంలో ఎప్పుడూ లేదు వారే నామినేషన్ లు తీసేయమని,పోలీసులు కూడా బెదిరించడం ఎక్కడైనా చూశామా. పోలీసులా వైసిపీ కార్యకర్తలా. యూనిఫారం తీసి వైసిపీ తరుపున పోటీ చేయండి. మహిళ ను నామినేషన్ వేయడానికి అడ్ఠుకుంటే జాకెట్ లో పెట్టుకుంటే జాకెట్ లో చేయి పెట్టి న వ్యక్తి పై చర్యలు ఏవి. ఇది ముఖ్యమంత్రి కి తెలియదా. ఎస్సీ మహిళ పై దౌర్జన్యం చేస్తే సిఎం,డీజీపీ కళ్ళు లేవా. అందరూ ప్రభుత్వం ని నిలబెట్టాలి. వీటి ఆధారంగా ఎన్నికల కమిషన్ ప్రక్రియ నిలిపారని నా బావన. కుల రాజకీయాలు ఆపాదించడం దారుణం. 43రెడ్ల కి పదవి లిచ్చి కుల పిచ్చి జగన్మోహనరెడ్డి ది. జగన్ దౌర్జన్యం వలన ఎన్ని కలు వాయిదా.ప్రజలంతా మీతో వుంటే దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది .చంద్రబాబు టైం లో రమేష్ కుమార్ కి పోస్ట్ ఇచ్చారనడం హాస్యాస్ప దం. పది నెలల గా రమేష్ కుమార్ అక్కడ వున్న విషయం గుర్తు లేదా. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి టైం లో ఇద్దరు రెడ్డి లు కమీషనర్ గా పని చేశారు. ఈ పోలీసులు వలన న్యాయ బద్దంగా ఎన్నికలు జరుగుతాయని నేను బావించడం లేదు. ఆంద్రప్రదేశ్ పోలీసులు తో న్యాయం జరగదు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని విన్నపం. టీడీపీ నేతలను చంపడానికి ప్రయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం దారుణం. నర్సీపట్నం లో చిన్న ఊరేగింపు చేస్తే నాపై నాన్ బెయిల్ బుల్. రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయం కి వస్తే ఎమ్మార్వో వనజాక్షి ని ఏదో జరిగింది అని ధర్నా లు చేశారు. నర్సీపట్నం నాతవరం మండలం లో ఎమ్మార్వో శ్రీనివాస్ వెళ్లి పోతే ఇన్ ఛార్జ్ ఎమ్మార్వో పై బూతులు తిడితే ఆయన పెన్ డౌన్ మూడు రోజులు చేస్తే మీ రెవెన్యూ సంఘం ఇప్పుడు ఎక్కడ వుంది. కలెక్టర్,జేసీ,ఆర్డీఓ లు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. నాన్ యస్సీ కి యస్సీ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆవిడ బీసీ మహిళ కి యస్సీ సర్టిఫికెట్ ఎలా అన్న ఎమ్మార్వో పై బూతులు పురాణం. వీరికి రక్షణ లేదా. రాష్ట్ర రెవెన్యూ సంఘం బాద్యత లేదా. వాలంటీర్లు పబ్లిక్ గా వైసిపీ జెండా లు పట్టుకుని తిరుగుతున్నా చర్యలేవి. ఈసీ కి కూడా ఫిర్యాదు చేస్తాం. ఎక్సైజ్ వారు మరీ దారుణం. గంజాయి కేసులు కూడా బనాయిస్తారని భయపడుతున్నాం. వాయిదా వేయడం కాదు. అంతా రద్దు చేసి మరలా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. కరోనా విషయం లో జగన్మోహనరెడ్డి జోకర్లా మాట్లాడారు.
















