Nene Raju Nene Mantri Movie App Realised Jyothi Theater,Visakhapatnam,Vizagvision…అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో స్టార్ హీరోలు, హీరోయిన్లతో స్వయంగా మనం ఫొటోలు దిగొచ్చు. ఇది సినిమాల ప్రమోషన్‌కి మరో మెట్టు అవుతుంది’ అని నిర్మాత సురేష్‌బాబు అన్నారు. రానా, కాజల్ జంటగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్లో భాగంగా అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని తీసుకొచ్చారు చిత్ర బృందం. ఆ విశేషాలను సురేష్‌బాబు బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో తెలియజేస్తూ, ‘మణిశంకర్, వాళ్ళ కుమారుడు భైరవ్, రోహిణి కలిసి ఈ యాప్‌ను క్రియేట్ చేశారు. ‘నేనే రాజు నేనేమంత్రి’ సినిమా పోస్టర్‌కు సంబంధించిన స్టాండీల వద్ద ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పోస్టర్‌పై ఉన్న కోడ్‌ను స్కాన్ చేస్తే పోస్టర్లో ఉన్న హీరో రానాగానీ, హీరోయిన్ కాజల్గాని బయటకు వచ్చి మనతో మాట్లాడతారు. మనతో ఫొటో దిగుతారు. ఆ ఫొటోలు చూస్తే స్వయంగా మనం వారితో ఫొటో దిగినట్టే ఉంటుంది. ఈ టెక్నాలజీని ప్రపంచంలోని మొదటి సారి ఉపయోగిస్తున్న చిత్రమిది. అది రానా చిత్రం కావడం ఆనందంగా ఉంది. ఇప్పటికే 650 థియేటర్లకు ఈ స్టాండీలను పంపించాం. అక్కడ ప్రేక్షకులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. మున్ముందు ఈ యాప్‌లో వీడియో కూడా వస్తుంది. తమకు నచ్చిన హీరో, హీరోహీరోయిన్తో ఫొటో దిగొచ్చు, డాన్స్ కూడా చేయోచ్చు. అంతేకాదు మనం అడిగే ప్రశ్నలకు వారు సమాధానాలు కూడా చెబుతారు. అయితే దీనికి కొంత టైమ్ పడుతుంది.
ఈ టెక్నాలజీని ఇతర నిర్మాతలు కూడా తమ సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవచ్చు. సినిమా మార్కెటింగ్‌లో ఇది మరో ముందడుగు అవుతుంది’ అని అన్నారు. మొట్టమొదటిసారి ఈ అగ్మెంటెడ్ రియాలిటీతో రానాతో రాజమౌళి ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు భరత్ చౌదరి, వి.కిరణ్‌రెడ్డిలు, రోహిణి, భైరవ్ తదితరులు పాల్గొన్నారు