Save the Girls & Save Mothers Rally in Vijayawada Vizagvision…ఆడపిల్లలను రక్షించుకోవడంలో చట్టాలతో పాటు మనిషి మానసిక దృక్పధంలోనూ మార్పు రావాలని ఏసిపి సూర్య చంద్రరావు అన్నారు. మహిళల రక్షణ పట్ల ప్రతి ఒక్కరు అవగాహాన కలిగి ఉండాలని సూచించారు. సేవ్ గర్ల్సు , సేవ్ మదర్స్ పేరిట హెల్పింగ్ హ్యాండ్సు ఆధ్వర్యంలో నిర్వహించిన 3 కె రన్ ను ఆయన ప్రారంభించారు. బిఆర్టీఎస్ రోడ్డు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పడవల రేవు వరకు కొనసాగింది…అనంతరం పిల్లలను కాపాడు కోవాలంటూ విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి…

















