బీజింగ్: చైనాను ప్రాణాంతక వైరస్.. కరోనా పట్టి పీడిస్తోంది. చైనావాసులు ఈ వైరస్ వల్ల బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
కరోనా వైరస్ వల్ల రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
నిన్నటి వరకు 132 మంది ఈ వ్యాధికి బలైతే, తాజాగా ఆ సంఖ్య 170కి చేరింది.
అలాగే వ్యాధిగ్రస్తులు కూడా అంతకంతకు పెరుతున్నారు. నిన్నటివరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య 6వేలు ఉంటే, ఇవాళ్టికి 7వేలు దాటింది.
వారిలో దాదాపు 1300 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 9 వేలకు పైగా వ్యాధిగ్రస్తుల్లో 103 మంది కోలుకున్నట్లు చైనా అధికారికంగా తెలియజేసింది.
విదేశీ పౌరులు ఎవరైనా తమ దేశాలకు వెళ్లాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, ఈ వైరస్ 30 దేశాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.


















