‘ఉత్తరాంధ్ర కన్నీళ్లు’ హిందీ అనువాద ఉత్తరాంధ్ర కే ఆసు అనే పుస్తకాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ఆవిష్కరించిన సందర్భంగా అభినందన కార్యక్రమo in Visakhapatnam,Vizagvision..ఉత్తరాంధ్ర కన్నీళ్లు తెలుగు పుస్తకాన్ని “ఉత్తరాంధ్రకే ఆసు” పేరిట నగరానికి చెందిన జర్నలిస్టు నాగబోయిన నాగేశ్వరరావు హిందీలోకి అనువదించారు.
ఇందుకు ప్రేమ్ పబ్లికేషన్స్ అధినేత చాంద్ మల్ అగర్వాల్ సహకరించారు. వీరిద్దరూ ఇటీవల న్యూఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ వారి మిత్రులు, సాహితీ ప్రియులు ఎంవిపి లోని రామ్ కుందన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కన్నీళ్లు పుస్తకాన్ని హిందీలోకి అనువదించడం ద్వారా ఈ ప్రాంత జలవనరుల సమస్యను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు.