సాగర నగరం విశాఖలో పూల హరివిల్లు వెల్లివిరిసింది. వేలాది జాతులకు చెందిన రంగురంగుల పుష్పాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి. దేశంలో లాంగెస్ట్ ఫ్లవర్ స్ట్రీట్ ఆవిష్కృతమైంది. కిలోమీటరున్నర దూరంగా పాటు ఉన్న ఫ్లవర్ స్ట్రీట్ లో పూల సోయగాలను చూసి తన్మయం చెందుతున్నారు పర్యాటకులు. పుష్ప పరిమళం పర్యాటకుల మనసులను రంజింప చేస్తూ అకట్టుకుంటోంది.
పువ్వులు చూడగానే ఎవరికైన మనుసు పులకరిస్తుంది . వాటిని అలా చుస్తూ ఉండిపోవాలనిపిస్తుంది , తనివి తీరే వరకు ఆశ్వాసాధించాలనిపిస్తుంది. పుష్పాలకి అంతటి ఆకర్షణ ఉంటుంది. ఎవ్వరినైనా ఆకర్షించే గుణం వాటికే సొంతం. పూల మొక్కలను ఇంటి వద్ద పెంచుకుని అంతా ఆశపడుతున్నా నగరాల్లో గజం స్థలం దొరకడానికి కూడా గజగజలాడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అభిరుచి ఉన్నా సరే పూల పెంపకానికి చాలా మందికి సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో పర్యాటకంగా గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులందుకుంటున్న సన్ రే రిసార్ట్స్ సంస్థ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టంది. ఏక్కడో విదేశాల్లో మాత్రమే జరిగే ఫ్లవర్ స్ర్టీట్ ను విశాఖలో ప్రత్యక్షమయ్యేలా చేసింది. భోగాపురం సమీపంలో ఉన్న రిసార్ట్స్ లో ఏకంగా దేశంలోనే లాంగెస్ట్ ఫ్లవర్ స్ట్రీట్ ను ఆ సంస్థ ఏర్పాటు చేసింది.
ఫ్లవర్ షోలు, ఫ్లవర్ ఫెస్టివల్స్ వంటివి ఇప్పటివరకు విదేశాలకు మాత్రమే పరిమితం. మన దేశంలోనూ, దక్షిణ భారత దేశంలో చాలా అరుదుగా మాత్రమే పరిమితంగా అడపాదడపా జరుపుతుంటారు. అయితే ఇప్పుడు టూరిస్టుల సీజన్ కావడంతో పర్యాటకులను ఆకట్టుకోవడానికి సన్ రే రిసార్ట్స్ సంస్థ ఈ పుష్ప విలాసాన్ని విశాఖలో ఆవిష్కృతం చేసింది. తన రిసార్స్ట్ లో దాదాపుగా 1.5 కిలోమీటర్ల మేరకు ఫ్లవర్ స్ట్రీట్ ను ఏర్పాటు చేసింది. ఇందుకుగాను జర్మనీ, సింగపూర్ తో పాటుగా పలు దేశాలకు చెందిన పూల జాతుల సీడ్స్ ను తీసుకువచ్చారు. మన ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి అనువుగా ఉండే పుష్ప జాతులను ఎంపిక చేసుకుని ఇక్కడ వాటిని అభివృద్ధి చేసారు. ఇలా ఇందులో దాదాపుగా 22 కి పైగా రంగులకు చెందిన పూలు ఉన్నాయి. ఇంధ్రధనస్సులో ఉండే రంగులను మించి ఈ ఫ్లవర్ స్ట్రీట్ లో రంగుల రంగుల పూలు కొలువుదీరాయి. అంతేకాదు 25వేల ఫ్లవర్ పాట్స్ ఈ స్ట్రీట్ ఫ్లవర్ లో పూల అందాల విరబూతకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు 50 వేల వరకు వివిధ పుష్పాలు ఫ్లవర్ స్ట్రీట్ లు కనువిందు చూస్తూ అలరిస్తున్నాయి.
సన్ రే రిస్టార్ట్స్ లో కొలువుదీరిన ఈ పూల వీధిని చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులను కట్టిపడేస్తోంది.
దేశంలోనే అతిపెద్ద పూల ప్రదర్శన ఇంతకు ముందెన్నడూ చూడలేదంటూ పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఒకే చోట ఇన్ని వేల రకాల పూల మొక్కలు పుష్పాలు కనువిందు చేస్తున్నాయని పర్యాటకులు ముచ్చటపడుతున్నారు. ఈ పుల ప్రదర్శన చూస్తుంటే ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందని పర్యాటకులు ఆంనందం వ్యక్తం చేస్తున్నారు