“Smart Hoteling With POBYT” APP Stay by the hour, pay by the minute Visakhapatnam
పో బైట్ యాప్ ద్వారా మీకు కావాల్సిన బడ్జెట్లో గంటల ప్రాతిపదికన హోటల్స్ బుకింగ్ కొరకు ఈ యాప్ ఎంతగానో సహకరిస్తుందని పొబైట్ యాప్ ప్రతినిధి నిఖిల్ గుర్రాల తెలిపారు. గురువారం ఉదయం దస్పల్ల హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ హోటల్ బుకింగ్, ఏ సమయంలోనైనా చెక్ ఇన్, చెక్ అవుట్ వంటి అత్యుత్తమమైన సేవలు ఈ యాప్ ద్వారా లభిస్తోందన్నారు. ఈ యాప్ 2 0 18 లో స్థాపించబడి వృద్ధి చెందుతూ తన సేవలను హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లాంటి మహానగరాలలో విస్తరించిందన్నారు. యాప్ లో 105 పైగా హోటల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. గంటల ప్రాతిపదికన హోటల్స్ లో బస చేయడానికి యాప్ మార్గదర్శకంగా ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ యాపిల్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విలేఖరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి శరత్ పాల్గొన్నారు
















