“Simhachalam Giri Pradakshina” Arrangements, Visakhapatnam, Vizagvision ..విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఉత్సవాలలో ప్రధానమైనది ఈ గిరి ప్రదక్షణ ఉత్సవం. రాష్ట్ర నలుమూలలనుండి సుమారు ఐదు లక్షల మంది భక్తులు పాలుగుంటారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అందుకు తగిన ప్రత్యేక క్యూ లైన్లు , గిరిచుట్టూ ఉన్న 32 కిలోమీటర్లు వైద్య సదుపాయం , మొబైల్ టాయిలెట్స్ , మంచినీరు , షామియానా పందిర్లు వేసి భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. ఈ నెల 8 వ తేదీ శనివారం స్వామివారిని అందంగా అలంకరించి స్వామివారి ప్రచారరధంలో అధిష్టింపజేసి ప్రత్యేకపూజలు నిర్వహించి గిరి తిరిగే 32 కిలోమీటర్లు రధయాత్ర నిర్వహించనున్నారు. ఆర్టీసీ అధికారులు వినూత్నంగా వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేకబస్సులను ఏర్పాటుచేసి 300 రూపాయలతో ఈ బస్సులను నడపనున్నారు. మరుసటి రోజు స్వామివారికి ఆఖరివిడత చందనము సమర్పించనున్నారు. అదేరోజు గిరి చుట్టూ తిరగలేని భక్తులు గుడి ప్రదక్షణ 32 సార్లు చేస్తారు. గుడిప్రదక్షణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో జరిగే ఆర్జితసేవలను ఆరోజో నిలిపివేయనున్నారు. ఈఓ మీడియాతో మాట్లాడుతూ అన్ని సేఖల సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు.