నిన్న రాత్రి తెన్నేటి పార్క్ ఎదురుగా ఉన్న కైలాసాగిరి కొండ పై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.ఐతే ఈ ఘటన అర్ధరాత్రి సమయములో జరగడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో అటువైపు బీచ్ రోడ్ ను బ్లాక్ చేసి ఉన్నతాధికారులు, ట్రాఫిక్ adcp ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ కొండ చరియాలను ప్రోక్లిన్ తో తొలగింపుచర్యలు చేపట్టారు. దీనికి కూతవేటు దూరంలో మరో కొండ భాగం భారీ గా విరిగి పడడానికి సిద్ధంగా ఉంది. దేనితో ఇంజనీరింగ్ నిపుణులను రప్పించి వీటి ని ఎలా తోలగించాలని సమాలోచనలు చేస్తున్నారు.