Sri Paidithalli Ammavari Teppotsavam శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం in Vizagnagram,Vizagvision…
విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువుగా జరిగింది. అమ్మవారి సిరిమాను ఉత్సవాలలో భాగంగా ఈ ఉత్సవాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ముందుగా వనం గుడిలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి తెప్పలో ప్రతిష్టించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య చారిత్రక పెద్ద చెరువులో అమ్మవారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని వేలాది మంది ప్రజలు వీక్షించి పులకించారు.