Fire in photo studio SVN Opposite Paidithalli Devasthanam Temple in Vizagnagram,Vizagvision…
విజయనగరం జిల్లా కేంధ్రంలోని పైడితల్లి దేవస్ధానం ఎదురుగా ఉన్న ఎస్.వి.ఎన్. ఫోటో స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్ధు భవనంలో స్డూడియో ఉంది. మూడవ అంతస్తులో మంటలు చెలరేగి , పొగలు వ్యాపించాయి. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు మంటలు వ్యాపించడం చూసి అగ్నిమాపక శాఖకు, స్డూడియో యాజమాన్యానికి సమాచారం అందించారు. తెల్లవారు ఎనిమిదిన్నర గంటల సమయంల సంఘటన జరగడంతో సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాలేదు. . సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ షార్క్సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసు, రెవిన్యూ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన బహుళ అంతస్తుల్లో ధర్డఫ్లోర్లో యుపిఎస్‌లు ఉంచిన ప్రాంతంలో మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్‌ను నిలిపివేశారు.