వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముంగిట శిశువుతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన in Visakhapatnam,Vizagvision…
వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముంగిట శిశువుతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన.
వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు.
రాత్రి 11.30 గంటలకు మగ శిశువు జన్మించిందని, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్ల శిశువు మృతి చెందిందని వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలియజేశారు.
కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత..
పేగు చుట్టుకోవడం వల్ల మృతి చెందారని వైద్యులు చెప్పారన్నారు.
రెండుసార్లు రెండు విధాలుగా చెప్పడంతో.. అనుమానం వచ్చి శిశువుని పరిశీలించడంతో తలపై గాయాలు రక్తం ఉన్నాయని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్తవలస చెందిన పెద్ద గాడ ప్రసన్నకుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు. భార్య పెదగాడి జ్యోతికి నెలలు నిండడంతో ఈ నెల 9వ తేదీన ప్రభుత్వ గోషా ఆస్పత్రికి పురుడు కోసం తీసుకువచ్చారు. రాత్రి పదకొండున్నర గంటలకు జ్యోతి మగబిడ్డకు జన్మనిచ్చింది.