ఇనుము ఓర్ ను లోడ్ చేస్తున్న సమయం లో మొబైల్ క్రేన్ ఇంజన్ రూం లో మంటలు వచ్చాయి. దీంతో క్రేన్ డ్రైవర్ వెంటనే క్రేన్ ను బెర్త్ కు దూరం గా తీసుకు వెళ్ళాడు. అనంతరం అతను కూడా సురక్షితం గా బయటకు వచ్చాడు. వెంటనే రంగం లోకి దిగిన పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం గా ప్రాథమికంగా అంచనా వేశారు. 2017 లో తయారైన మొబైల్ క్రేన్ సిపోల్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఘటన పై పోర్ట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాద నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. మంటలను అదుపులోకి తెచ్చిన తరువాత బెర్త్ పై యధావిధిగా పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బెర్త్ వద్ద పరిస్ఠితి సాధారణ స్థితికి వచ్చింది