భారీగా పోలీసుల మోహరింపు
అన్ని మార్గాలు దిగ్బంధం
బీచ్ రోడ్డులో కర్ఫ్యూ వాతావరణం
ఉదయం 5 గంటల నుంచే నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు
జిల్లావ్యాప్తంగా 623 మంది అరెస్టు
వైసీపీ నేతల గృహ నిర్బంధం
బీచ్ రోడ్డుకు చేరని ప్రత్యేక ఉద్యమం
యువజనాగ్రహంపై పోలీసుల ఉక్కుపాదం…ఎక్కడికక్కడ బ్రేక్‌లు
జగన్‌నూ అడ్డుకున్నవైనం
పక్కా వ్యూహంతో వ్యవహరించిన భద్రతా బలగాలు
ప్రత్యేక నిరసనలపై నీళ్లు చల్లిన వైనం
చిన్నచిన్న ఆందోళనలతో ముగిసిన పోరు
వైసీపీనాయకులు భీమిలి తరలింపు
ప్రత్యేక హోదా డిమాండ్‌తో విశాఖ సాగరతీరంలో గురువారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఒక్కరిని కూడా తీరంలోకి రాకుండా తెల్లవారుజాము నుంచే అడ్డుకోవడం ప్రారంభించారు. బీచ్‌కు వచ్చే అన్ని మార్గాలను మూసివేయడంతో తీరంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.
అటు జన‘సేనాని’ పిలుపు…ఇటు వైసీపీ అధినేత రాక…బీచ రోడ్డులో ‘ప్రత్యేక’ ఉద్యమ ప్రణాళిక. మరో 24 గంటల్లో పెట్టుబడి భాగస్వామ్య సదస్సు జరగనుంది. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు రానున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ అవాంఛనీయ ఘటన జరిగినా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే పోలీసులు పక్కా వ్యూహంతో ఎగసిపడుతున్న యువ కెరటం తీరానికి చేరకుండా అడ్డుకున్నారు. వైసీపీ నేతల రాకకు బ్రేక్ వేశారు. ఆ పార్టీ అధినేతను ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని తిప్పిపంపారు. దీంతో అక్కడక్కడా ఆందోళనలు, సాయంత్రం ఎక్కడికక్కడ కొవ్వొత్తుల ర్యాలీలతో పోరు ముగిసింది.
విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి
సాగర తీరం… అదీ సెలవు రోజు… ఆర్కే బీచలో ఎలావుండాలి…కానీ పోలీసుల దిగ్బం ధంతో బీచ బోసిపోసింది. ఉదయం నుంచి బీచలోకి ఎవరినీ అనుమతించక పోవడంతో నిర్మానుష్యంగా కనిపించింది. బీచ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్లన్నీ మూసివేసిన పోలీసులు వచ్చేవారిని ఎక్కడికక్కడ అడ్డుకు న్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో జనసేన మౌన ప్రదర్శన,
వైసీపీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టేందుకు నిర్ణయిం చడంతో అను మతిలేదని పోలీసులు అంగీకరించ లేదు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పిలుపు నివ్వడంతో యువత నిరసన తేలిపే అవకాశం వుం దని భావించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ అధినేత జగన కొవ్వొత్తుల ర్యాలీకి హాజరవుతున్నట్లు ప్రకటించడంతో పోలీసులు వారినీ అడ్డుకున్నారు. శుక్రవారం నుంచి నగరంలో భాగస్వామ్య సదస్సు జరగనుంది. వివిధ దేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వచ్చే ఒకరోజు ముందు గొడ వలు జరిగితే నగరం పరువుపోతుందని ప్రభుత్వం భావించింది.
పైగా నిత్యం జనసమ్మర్థంగా ఉండే బీచలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తీరని నష్టం వాటిల్లుతుందని భావించి పోలీసులు ఏ ఒక్కరినీ బీచలోకి అనుమతించలేదు. ఉదయం 9 గంటలకే ఈ రోడ్డులోకి ప్రవేశించే ముఖద్వారం వద్ద బ్యారికేడ్లు పెట్టేశారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. బీచకు వచ్చే యువకుల గుర్తింపు కార్డులు తనిఖీచేశారు. అనుమానం వస్తే అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్ తర్వాత ఆర్కే బీచరోడ్డుకు వెళ్లేరోడ్డులో పలు ప్రయి వేటు ఆసుపత్రులు ఉన్నాయి. దీంతో రోగులను చూసేందుకు వచ్చిన బంధువుల వివరాలు తెలుసు కుని అనుమతించారు. ఎక్కడకు వెళ్తుతున్నారో తెలుసుకోవడంతో పాటు గుర్తింపు కార్డులు చెక్ చేశారు. ఆర్కేబీచని ఆనుకుని ఉన్న నివాసితులు ఎప్పుడేమి జరుగుతుందో అని ఆందోళన చెందారు. సెలవు రోజు కావడంతో బీచ్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు మాత్రం తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
ప్రత్యేక హోదాను కోరుతూ విశాఖపట్నంలో ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను గురువారం సాయంత్రం భీమిలి పోలీసు స్టేషనుకు తరలించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమరనాథ్, రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ తదితరులను ఇక్కడకు తీసుకువచ్చారు. నగరంలోని పోలీస్ స్టేషన్లలో ఉంచితే కార్యకర్తల ఆందోళనకు దిగే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
పలు సంఘాల ‘ప్రత్యేక’ నిరసన
విశాఖపట్నంలో ప్రత్యేక హోదా డిమాండ్‌తో గురువారం రాజకీయపార్టీలు,విద్యార్థి జేఏసీలు, మహిళా సంఘాలు రోడ్డెక్కెడంతో పోలీసులు ఎక్క డికక్కడ నిర్బంధించారు. సీపీఎం శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఛలో ఆర్కేబీచ కార్యక్రమం నిర్వహిం చారు. పోలీసులు అరెస్టుకు యత్నించగా తప్పించుకుని జగదాంబ జంక్షన వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఐద్వా, సీపీఎం, సీఐటీయూ శ్రేణు లు పాల్గొన్నాయి. స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ విద్యార్థులు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దీంతో నెట్వర్క్ అధ్యక్షుడు బసవ కృష్ణమూర్తి, జి.ప్రవీణ్‌కుమార్, బండి పురుషోత్తంలను పోలీసులు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మౌన పోరాటం చేశారు. నిరసనలో పార్టీ నాయకులు బెహరాభాస్కరరావు, పేడాడ రమణి కుమారి, గుంటూరు భారతి పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల విద్యార్థులు దాదాపు వెయ్యి మంది రావడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. నిరసనకారులను వెళ్లిపోవాలని పదేపదే విజ్ఞప్తిచేసినా వినకపోవడంతో అరెస్టుచేసి స్టేషనకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ముఖ్య మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడారు. సాయంత్రం వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టుచేసి తరలించారు.