యురేనియం త్రవ్వకం, శుద్ది సకల జీరాశులకు పర్యావరణానికి అత్యంత ప్రమాదకరం
నల్లమలై అటవీ ప్రాంతంలో యురేనియం మైనింగ్ కార్పొరేషన్ వారు యురేనియం మైనింగ్ మొదలు పెట్టడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతులు ఇవ్వడం ప్రజాహితం కాదు.
నల్లమలై కొండలలో ఉన్న అమ్రాబాద్ ప్రాంతం షెడ్యూల్డ్ కులాల ప్రజలకు తరతరాలుగా స్థావరం. మైనింగ్ వలన వారి ఉపాధులు దెబ్బతింటాయి. వారి మానవహక్కులు భంగం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వారి పట్ల ఉదాసీనత చూపడం బాధాకరంగా ఉంది.
ఈ ప్రాంతం వైల్డ్ లైఫ్ పరిరక్షణ చట్టం క్రింద నోటిఫై అవ్వడమే కాకుండా, దేశంలో పెద్ద పులులు ఇతర జంతువులు దట్టంగా ఉన్న ప్రదేశం. అటువంటి ప్రదేశాన్ని జాగ్రత్తతో పరిరక్షించుకోవాలి. మైనింగ్ మొదలు పెట్టడంతో టైగర్ రిజర్వు కు అపారమైన భంగం కలుగుతుంది.
అదే కాకుండా, మైనింగ్ లో వచ్చే వ్యర్ధ పదార్ధాలు (టైలింగ్స్) లోయురేనియం, థోరియం, రాడాన్ వంటి రేడియో యాక్టివ్ కణాలు ఉంటాయి. అవి విషపదార్థాలు, ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీసేవి. నల్లమలై కొండలు కృష్ణానది పరివాహిక ప్రాంతం లో ఉండడం వలన, అటువంటి విష పదార్ధాలు భూగర్భ జలాలలోనికే కాకుండా కృష్ణా నది లో ప్రవేశించి నది దిగువ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి.
కడపలో ఇదే యురేనియం కార్పొరేషన్ చేపట్టిన యురేనియం మైనింగ్ వలన అటువంటి పరిణామాలు కలిగి ప్రజా ఉద్యమానికి దారితీసాయి.
ఈరోజు దేశ వ్యాప్తంగా నీటి కొరత భయంకరమైన సమస్యగా మారడం అందరికీ తెలిసిన విషయం. ప్రధాన మంత్రిగారు ఈ సమస్యమీద పదే పదే ప్రస్తావించారు. అటువంటి సమయంలో మనకు ప్రకృతి ప్రసాదించిన జల వనరులను అతి జాగ్రత్తతో పరిరక్షించుకోవాలి కాని ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టి ఆ వనరులకు భంగం కలిగించడం ఏ పరిస్థితిలోనూ సమంజసంగా లేదు.
అంటే, నల్లమలై ప్రాంతంలో యురేనియం మైనింగ్ వలన కలిగే లాభాలతో పోల్చి చూస్తే సమాజానికి కలిగే నష్టాలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను అనుమతులను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము
మా ఆందోళన వెనక ఇప్పటివకూ అభివృద్ధి చెందిన దేశాల్లో యురేనియం త్రవ్వకం, శుద్ది సకల జీరాశులకు పర్యావరణానికి హాని, ఇంకా పరిష్కారం కానీ బాధితుల గోడు ఉంది. అమెరకాలో అత్యంత కటినమైన చట్టం వుంది, అది “Radiation Exposure Compensation Act 1990” అప్పటికి అక్కడ యురేనియం త్రవ్వకం, శుద్ది వల్ల సకల జీరాశులకు పర్యావరణానికి హాని జరిగింది. నవాజో నేషన్ అమెరికాలో ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో 1944 నుండి 1986 వరకు జరిపిన యురేనియం తవ్వకాల బాధితులకు అమెరికా పర్యావరణ పరరక్షణ సంస్థ మధ్య జరిగిన కోర్టు కచేరీ 30 సంవత్సరాల తర్వాత మే 2017న్ పరిష్కారం కుదిరింది, వరకూ ₹15478 కోట్లు పరిష్కారంగా 34,372 మందికి మాత్రమే ఇవ్వగా ఇంకా పరిష్కారం కానీ గుర్తించబడని బాధితుల సంఖ్య లక్షాలలోనే ఉంది. అంతెందుకు భోపాల్ గ్యాస్ బాదితుల తరపున భారతప్రభుత్వం ₹22,731 కోట్లు పరిష్కారంగా అడిగితే అమెరికాకి చెందిన యూనియన్ కార్బైడ్ అనే సంస్థ కేవలం ₹3237 కోట్లిచి దివాళా తీసినట్లు ప్రకటించారు. మన కోర్టు ప్రభుత్వానికి చెందిన కొంతమంది అధికారులని రెండు సంవత్సరాలు కారాగార శిక్షతో సరిపెట్టారు. భోపాల్ భాదితులు 30 సంవత్సరాలుగా సాయం కోసం అంగవైకల్యం తో నిరీక్షిస్తున్నారు.
మనకి ఇప్పటివరకూ చాలా చట్టాలు వున్నాయి.. నీటి పరిరక్షణ చట్టం 1974; పర్యావరణ పరిరక్షణ చట్టం 1986; అటవీ రక్షణ చట్టం 1989; వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972; వాయు కాలుష్యము నివారణ చట్టం 1981 మరియు అణు సంరక్షణ మరియు యాజమాన్య సంస్థ 2011.. కానీ ఇవేవీ రేడియేషన్ ప్రభావం గురైన వారి రక్షణ కోసం సరిపోవు. కాబట్టి అమెరికాలో మార్చ్ 2019 న ప్రవేశపెట్టిన “S.947 రేడియేషన్ బాధిత పరిహార చట్ట సవరణలు” సహితమైన చట్టాన్ని రూపొందించిన తర్వాత మాత్రమే అదికూడా ఇక్కడి ఆదివాసీలు ప్రజలు అంగీకారం లేకుండా విచక్షణా రహితంగా మైనింగ్ అదికూడా యురేనియం తవ్వకాలు జరపరాదు.
కేవలం 0.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కల్యణపులోవ తవ్వకాలను ఆపేందుకు వచ్చిన రాజేంద్ర సింగ్ స్వయంగా వచ్చినప్పుడు 84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుపతలపెట్టిన భారీ ప్రకృతి మరియూ కృష్ణా నదీ జలాలను కలుషితం చేసే తవ్వకాలను ఆపేందుకు తప్పక వస్తారు.. అవరసమైతే ప్రాణాల్ని పణం గా పెట్టైన సరే ప్రకృతిని కాపాడుకుందాం