సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అజేయ్ కల్లం,Vizagvision….
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం సచివాలయం మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం పదవీబాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధిపతిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన(రాజకీయ వ్యవహరాలు) ముఖ్య కార్యదర్శి రామ్ప్రకాష్ సిసోడియా, ఏపీ ట్రాన్స్కో ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, పలువురు అధికారులు అజేయ్ కల్లంను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు

















