తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని దేవేగౌడ దర్శించుకున్నారు. 86వ పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. అనంతరం రంగనాయకుల మండపంలో దేవేగౌడ కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. ఆలయ వెలుపలకు వచ్చిన దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, కుటుంబ సభ్యులతో కలసి తన పుట్టిన రోజు స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రధాని పీఠం ఎవరు ఎక్కుతారో తెలియదు కానీ.. మా జేడిఎస్ పార్టి, కాంగ్రెస్ తో కలసి పని చేస్తుందని తెలిపారు. కర్ణటక సీఎం హెడ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్, జేడి.ఎస్ పార్టిలు ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేసాంమని, 18 నుండి 19 సీట్ల వరకూ కాంగ్రెస్ జే.డి.ఎస్ కూటమికి కైవసం కానుందని ధీమా వ్యక్తం చేసారు. కేంద్రంలో ఎవరూ పరిపాలన కోనసాగిస్తారో అనే అంశం తెలాలి అంటే 23 తేదీ వరకూ వేచి ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు కుమార్ స్వామి తెలిపారు. అనంతరం పద్మావతి అతిధిగ్రుహం వద్ద మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మర్యాద పూర్వకంగా దేవేగౌడను కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశరాజకీయాలపై దేవేగౌడతో కలసి చర్చించారు. చింతమోహన్ మాట్లాడుతూ.. మోదీ పధనం ప్రారంభంమైందని, కేంద్రంలో సుక్యూలర్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.


















