శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో బుధవారం రెండు చోట్ల మంచు చరియలు విరిగిపడిన ఘనటలో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇందులో 14 మంది సైనికులు కాగా మరో ఆరుగురు పౌరులు.
గురువారం గురేజ్ ప్రాంతంలో 10 మంది జవాన్ల మృత దేహాలను వెలికితీయగా శుక్రవారం మరో పది బయటపడ్డాయి. ఇందులో నాలుగు మృతదేహాలు సైనికులవికాగా మిగతా ఆరు స్థానికులకు చెందినవిగా ఆర్మీ అధికారులు తెలిపారు. హిమపాతంలో కూరుకుపోయిన వారిలో ఏడుగురిని ఆర్మీ సహాయక బృందం రక్షించింది. రెస్క్యూ ఆపరేషన్ శుక్రవారంతో ముగిసింది.