ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ : ఈసీ,Telengana..తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి. ఈ సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ లో మాట్లాడిన నాగిరెడ్డి..మూడు విడతలుగా తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు.
జనవరి- 7 నుంచి 21వరకూ మెదట విడత.11 నుంచి 25 వరకు రెండో విడతలో..16 నుంచి 30 వరకూ మూడో విడతగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. పంచాయతీల్లోని ఓటర్లలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గత ఏడాది మే నెలలోనే ఓటర్ల జాబితాను రూపొందించామని.. ఒక కోటి 49లక్షల 52వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. 16 లక్షలకు పైగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు.
ఓటర్ల జాబితా నుంచి 4,52,093 మంది ఓటర్లను తొలగించటం జరిగిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను డీపీవోలు అందజేస్తారని..ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ లను ఉపయోగించనున్నామని తెలిపారు. నోటా గుర్తు కూడా బ్యాలెట్ పేపర్లో ఉంటుందన్న ఆయన.. జనరల్ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ ఫీజు 2వేలు, జనరల్ వార్డ్ మెంబర్ అభ్యర్థి నామినేషన్ ఫీజు 500 ఉంటుందని చెప్పారు.
జనరల్ సర్పంచ్ అభ్యర్థి.. 2లక్షల 50వేల వరకు ఖర్చు చేయవచ్చు అని తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ఓటు వేయటానికి అర్హుడు. 18 రకాల గుర్తింపు కార్డ్ ద్వారా ఓటును వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటలకు మైక్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చని.. జనవరి 21న మెదట విడత.. రెండో విడత 25న .. మూడో విడత పోలింగ్ 30వ తేదీన జరుగుతోందన్నారు.
ఉదయం 7 గంటల నుంచి 1గంట వరకూ పోలింగ్ .. మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని.. అదే రోజు వార్డ్ సభ్యులు సర్పంచ్ ను ఎన్నుకుంటారన్నారు నాగిరెడ్డి. ఇంకా కాలపరిమితి ఉన్న 19 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరపటంలేదన్నారు. మెదట విడతలో 4,480 పంచాయతీలకు.. రెండో విడతలో 4,137 పంచాయతీలకు, మూడో విడతలో 4,115 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని..ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం కొత్త పథకాలు, అధికారిక పర్యటనలు చేయటానికి వీల్లేదని, బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థి పేరు ఉండదని తెలిపారు. బ్యాలెట్ పేపర్ తెల్లరంగు, పింక్ రంగులో ఉంటోందన్నారు. ఒక లక్షా 50వేల మంది సిబ్బందిని పంచాయతీ ఎన్నికల కోసం డ్యూటీ చేస్తారని తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి.
















