మంచు కురిసే వేళలో
కృష్ణా జిల్లాలో దట్టమైన పొగమంచు…
సూర్యుని సైతం చల్లని చంద్రుని గా మార్చిన పొగమంచు..
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దట్టమైన పొగమంచు…
రోడ్డు కనపడక జాతీయ రహదారి పై లైట్లు వేసుకుని వెళ్తున్న వాహనాలు…
సిమ్లా, కాశ్మీర్ ను తలపిస్తున్న హైదరాబాద్..విజయవాడ హైవే రహదారి…
ఉదయం ఎనిమిది గంటల అయిన వెలుతూరు లేని కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని జాతీయ రహదారిపై వెళ్ళవలసి వస్తుంది…..
భారీ వాహనాల వల్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు…..
కళ్లముందు కనిపించిన వాహనం కొద్దిదూరం వెళ్లేటప్పటికి పొగమంచులో కలిసిపోయి కనబడకుండా పోతున్నాయి…
తెల్లవారుజామున బయలుదేరే చిరు వ్యాపారులు పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు