TDP Comments on YSRCP MLA Anitha,Visakhapatnam,Vizagvision…
నేర చరిత్ర ఉన్న రాజకీయ నేతలు భూ కుంభకోణాలపై వ్యాఖ్యలు చేయ్యడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు విశాఖజిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే అనతి…విశాఖ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామవేశంలో మాట్లాడిన అనిత వైకాపా నేతలపై నిప్పులు చెరిగారు…భూముల రికార్డులను ఆన్ లైన్ చేసే క్రమంలో బయట పడ్డ భూ అక్రమాలు కేవలం జిల్లా అధికారుల ముందస్తు చర్యలతోనే బట్టబయలు అయితే దాన్ని వైకాపా నేతలు వెలుగులోకి తీసుకొచ్చామంటూ ప్రచారాలు చేయ్యడం సరికాదని అన్నారు…సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించే కావాలనే దానికి వైకాపా నేతలు రాజకీయ రంగు పులుముతున్నారని అన్నారు…ముదపాకలో భూ కుంభకోణాలకు తనకు సంబందం ఉందని చెప్తున్న వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండించిన ఆమే దీనిపై నిజ నిర్ధారణ చేయ్యాలని సవాల్ విసిరారు…వైకాపా నేతలు తమ హద్దు మీరి ప్రవర్తిస్తే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు…
బైట్ …అనతి… విశాఖజిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే