బంగాళాఖాతంలో ఏర్పడిన ఫేదాయి తుఫాన్ బెంబేలెత్తిస్తోంది. బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడుతున్న ఈ తుఫాను విశాఖలో విలయం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రైళ్లు, విమానాలు రద్దు చేశారు. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫానుకు సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు.