Pethai Cyclone Between Kakinada & Tuni Crosses From 11.30 am to 2:30 pm Storm Afternoon Collector Praven Kumar in Visakhapatnam,Vizagvision..RTGS పెథాయ్ తుపాన్ హెచ్చరిక
*కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్
*తుపాన్ తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది
*గంటలకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాన్
*ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల లోపు తీరం దాతనున్న తుపాను.
*యానాం నుంచి తుని మధ్య తీరం దాటనున్న తుపాను
*గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదుడు గాలులతో తీరం దాటనున్న పెథాయ్
*తూర్పుగోదారి, పచ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి
*తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి
*విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి
*తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడుతుంది
*ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి
*అరటి రైతులు, ఉద్యానవన రైతులు జాగ్రత్తల్లో ఉండాలి
వరి, జొన్న, తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలి.
పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భధ్రపరచాలి
వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు ఇవి పొందవచ్చు
గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉన్న నివాసముంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి
లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
తుపాన్ తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదు
రోడ్లపై వాహనాల్లో తిరగరాదు, చెట్ల కింద తలదాచుకోరాదు.
తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి