Again AP CM Chandrababu Naidu Spoken to Media Ex-MP Sabbam Hari in Visakhapatnam,Vizagvision,,
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఇదే కొనసాగితే ఆయన తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం ఖాయమని మాజీ ఎంపీ సబ్బంహరి అభిప్రాయం వ్యక్తం చేశారు.రాష్ట్ర రాజకీయ పరిణామాలపై విశాఖలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు
దేశంలో మోడీ కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనడానికి మూడు రాష్ట్రాల ఎన్నికల నిదర్శనమని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ గెలుపునకు భారతీయ జనతా పార్టీ సహకరించిందనే మాట వాస్తవం అన్నారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కేసీఆర్ ఆంధ్రా వస్తే ఇక్కడ చంద్రబాబు గెలుస్తారు అన్నారు. ఇప్పటికైనా తగాదాలు విడిచిపెట్టి ధర్మబద్ధంగా విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటిని కేసీఆర్ అప్పగించాలన్నారు