25yrs celebrating SIMBEX Singapore India Maritime Bilateral Exercise,in Visakhapatnam,Vizag Vision..దేశాభివృద్ధికి తోడ్పాటును అందించడం కోసం నేవీ అంకితభావంతో కట్టుబడి ఉందని తూర్పు నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా వెల్లడించారు. జల రవాణాలో నేవీ కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన నిరంతర భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసారు. సింబెక్స్ ఉత్సవాల్లో భాగంగా ఐఎన్ఎస్ సహ్యాద్రిపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగపూర్ నేవీ చీఫ్ లీ చ్యూన్ తో కలిసి లంబా మాట్లాడారు. భారత్, సింగపూర్ నావికాదళాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. సింగపూర్ ఆయుథ సంపత్తి అమోఘమని, వారి శక్తిసామర్థ్యాలు అబ్బురపరిచాయన్నారు. అనంతరం సింగపూర్ నేవీ చీఫ్ లీ చ్యూన్ మాట్లాడుతూ, భారత నౌకాదళంతో బంధం చాలా విలువైనదని తెలిపారు. సింగపూర్ చిన్నదేశమైనా, భారత్ అతిపెద్ద దేశాల్లో ఒకటైనప్పటికీ తమ మధ్య పరస్పర సహకారంతో సంబంధ బాంధవ్యాలు బలోపేతమయ్యాయన్నారు. ఈ రెండు దేశాల మధ్య పటిష్టమైన బంధం ఏర్పడేందుకు దివంగత ప్రధాని పీవీ నరసింహరావు అప్పట్లో పునాదులు వేయగా, ఇప్పుటి ప్రధాని నరేంద్ర మోడీ మరింత బలోపేతం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం సింబెక్స్ సిల్వర్ జూబ్లీ ఉత్తవాల్లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్ ను, సింగపూర్ స్టాంప్స్ ను ఇరు దేశాల నౌకాదళాధిపతులు ఆవిష్కరించారు.