ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీమిలి ఉత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది . పలు పాఠా శాల ల విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శనల తో వీక్షకులను అలరిస్తున్నారు. వేల సంఖ్యలో పాల్గొన్న ప్రజల మధ్య బీమిలి ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన గావించి, బెలూన్ లను ఎగుర వేసిన అతిథులు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత దేశంలోనే రెండవ పురాతన ప్రాంతం భీమిలి అని, చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నారు. వీటి ని ప్రతీ ఒక్కరూ తెల్సు కోవాలన్నరు.. ఇక నుండి ప్రతీ సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు సహకరిస్తున్నారు,ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ ఫెస్టివల్ లో సుమారు 25 వేల మంది మహిళలు,యువత,ఇక్కడ నిర్వహించిన పలు ఈవెంట్స్ లో ఉత్స్తాహంగా పాల్గొన్నారని, వీరందరికీ ప్రోత్సహిస్తూ బహుమతులను అందజేయా నున్నా మన్నారు…