సామాజిక ఆర్థిక అభివృద్ధి -ఇంజినీర్ల పాత్ర అంశంపై మెమోరియల్ లెక్చర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్
ఇంజినీరింగ్ లో విప్లవాత్మక మార్పులు,నూతన ఆలోచనలకు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ వేదిక గా నిలిచింది
ఇంజినీరింగ్ ప్రపంచాన్ని ఎంతగానో మార్చింది
ఇంజినీర్లు సైన్స్ మరియు సమాజానికి మధ్య వారధిగా నిలిచారు
మొదటి పారిశ్రామిక విప్లవం దగ్గర నుండి ఇప్పటి వరకు ఇంజినీర్లు అనేక సమస్యలు పరిష్కరించారు
ప్రస్తుతం 4 వ పారిశ్రామిక విప్లవం కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్,బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీ లలో అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుంది
ఆర్థిక అభివృద్ధి లో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు.ఇంజినీర్లు నూతన ఆవిష్కరణలు,సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా,చైనా,ఇండియా స్థిరమైన వృద్ధి ని సాధిస్తున్నాయి
అయినా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి
పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి,ఆరోగ్య భద్రత,సురక్షిత తాగునీరు,విద్య విషయంలో అనేక సమస్యలు పరిష్కరించాలి
మన దేశంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణల వలన అభివృద్ధి సాధ్యం అయ్యింది
ఆ తరువాత ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులు,ఫ్రీ మార్కెట్ ఎకానమీ వలన,ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వలన ఎనర్జీ, పోర్ట్స్,ఎయిర్ పోర్టులు,రోడ్లు ఇలా మౌలికవసతుల కల్పన లో ఎంతో అభివృద్ధి సాధ్యం అయ్యింది
అనేక సమస్యల పరిష్కారం వలన పేదరికం తగ్గింది.ఇంకా మన దేశంలో 176 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు
భవిష్యత్తు సర్వీస్ సెక్టార్ పై ఆధారపడి ఉంది.ఎన్ని ఉద్యోగాలు కల్పించాం అనేది కీలకంగా మారబోతుంది.
మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి…ప్రపంచానికి ఇండియా ఒక వర్క్ షాప్ లా మారే అవకాశం ఉంది
అలాగే ప్రపంచంతో పోటీ పడటానికి నూతన ఆవిష్కరణల పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
2014 లో రాష్ట్ర విభజన జరిగింది .ఇతర దక్షణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ తలసరి ఆదాయం ఉంది
2022 నాటికి
దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో
నెంబర్ వన్ స్థానంలోనూ,
2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం
నూతన రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రం వృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది.నూతన రాజధాని నిర్మాణానికి నూతన ఇంజినీరింగ్ ఆవిష్కరణలు దోహదపడ్డాయి
రెండంకెల వృద్ధి సాధించాం 11.22 శాతం వృద్ధి సాధించాం.
8.49 శాతం పారిశ్రామిక వృద్ధి,9.11 శాతం సర్వీస్ రంగం లో వృద్ధి సాధించాం
అనుకున్న లక్ష్యాలు సాధించాలి అంటే 15 శాతం వృద్ధి సాధించాలి
ఆంధ్రప్రదేశ్ అనేక కీలక ఇంజినీరింగ్ ప్రాజెక్టులు ప్రారంభించింది
నీటి భద్రత…
దేశంలోనే రెండు నదులను అనుసందానం చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా పంటలు కాపాడగలిగం
పోలవరం ప్రొజెకు నిర్మాణం వేగంగా జరుగుతుంది…దీని ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు,తాగునీరు సమస్య తీర్చడం తో పాటు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగబోతుంది
అమరావతి స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేస్తున్నాం
నూతన ఆవిష్కరణలకు అమరావతి వేదిక కాబోతోంది
చిన్న,మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మాణం చేపడుతోంది
ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల వలన ఆర్థిక అభివృద్ధి వేగాన్ని అందుకుంటుంది
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు
నూతన ఆవిష్కరణల వలన ప్రస్తుతం ఉన్న వ్యాపారాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి
ప్రొడక్ట్ ఇన్నోవేషన్ పై ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.రాబోయే కాలంలో ఇంజినీర్లు ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నారు.దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఇంజినీర్లు పూర్తి సహకారం అవసరం