Jagan case Accused Srinivasa Rao Heart Attack Treatment in KGH Visakhapatnam,Vizagvision..
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం బాగాలేదని పోలీసులకు తెలపడంతో కేజీహెచ్‌కు నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు తరలించారు. శ్రీనివాసరావును పోలీసులు భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. సమస్య ఏమిటీ అని అడిగితే.. నాకు వైద్యం కాదు.అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు చెప్పారు.