విశాఖపట్నం ఫింటెక్ ఫెస్టివల్ లో సందడి చేసిన మొదటి హ్యూమనాయిడ్ రోబో సోఫియా…
మంత్రి నారా లోకేష్ …సోఫియా మధ్య ఆసక్తికర చర్చ…
మనుషులు,రోబోలు కలిసి సామరస్య వాతావరణం లో ఉండటం సాధ్యం అవుతుందా అని మంత్రి లోకేష్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చిన సోఫియా
రోబోలు మనుషులకు మరింత దగ్గర అయ్యే రోజులు వస్తున్నాయి…అనేక రంగాల్లో రోబోలు మనుషులకు సహకారం అందించే అవకాశాలు ఉన్నాయి.మెడికల్ థెరపీ తో సహా అనేక రంగాల్లో రోబోలు అనేక సేవలు అందించే అవకాశం ఉంది
పోలీసింగ్ కోసం ప్రభుత్వం రోబోలు ఉపయోగించే అవకాశం ఉందా అని మంత్రి నారా లోకేష్ ని అడిగిన సోఫియా
ఒక్కప్పుడు రోబో కాప్స్ అనేది
ఊహజనితం.కానీ పెరుగుతున్న టెక్నాలజీ తో త్వరలోనే రోబో పోలీసింగ్ నిజం అయ్యే రోజులు దగ్గర ఉన్నాయి…నిఘా కోసం రోబో కాప్స్ వినియోగించే అవకాశాలు ఉన్నాయి…
మీ విజన్ చూసిన తరువాత ఒక విజన్ ఉన్న నాయకుడు అని అర్థం అయ్యింది.మీ ఆలోచనలు చుస్తే మీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నాను అని అన్న సోఫియా
మా ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది.2050 కి ప్రపంచంతో పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం…పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఉత్తమ వేదికగా మార్చాలి అని పనిచేస్తున్నాం అని సోఫియా తో అన్న మంత్రి లోకేష్
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోఫియా
తిత్లీ లాంటి విపత్తులు వచ్చినప్పుడు రోబోలు ఉపయోగపడతాయా?విపత్తులు వచ్చినప్పుడు నువ్వు ప్రాణ త్యాగం చేస్తావా అని అడిగిన ప్రశ్నకు
ప్రస్తుతం విపత్తులను ఎదుర్కొనే సామర్ధ్యం నాకు లేదు…కానీ జరుగుతున్న అభివృద్ధి వలన రానున్న రోజుల్లో ఇది సాధ్యం అవుతుంది.విపత్తులు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నా..
విశాఖపట్నం రావడం ,ఫింటెక్ ఫెస్టివల్ లో పాల్గొనడం ఎలా ఉంది
విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది…త్వరలోనే మళ్లీ విశాఖ వస్తాను