Kerala Floods-2018 Announces Rs 500-Crs Relief For Kerala,Vizagvision..
భారీ వర్షాల కారణంగా.. కేరళ దాదాపు నీట మునిగిన విషయం తెలిసిందే.
రుతుపవనాలు, అల్పపీడనాల వల్ల ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి.
ఇడుక్కీ డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. వర్షాల వల్ల సుమారు 100 మందికిపైగా మరణించారు.
అయితే ఇవాళ ఢిల్లీలో మాజీ ప్రధాని వాజ్పేయి అంత్యక్రియల అనంతరం ప్రధాని మోదీ.. కొచ్చి చేరుకోనున్నారు.
రాత్రి అక్కడే ఆయన బస చేస్తారు. ఆ తర్వాత శనివారం నీట మునిగిన ప్రాంతాలను మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు.
తక్షణ సహాయం కింద ఇప్పటికే కేంద్రం వంద కోట్లను ప్రకటించింది.
ప్రధాని మోదీ రెండు సార్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్తోనూ మాట్లాడారు.

















