అఖిలపక్ష సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శ్రీ విజయ సాయిరెడ్డి..
శ్రీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్ః-
టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను వైయఆర్సీపీ డిప్యూటీ లీడర్ గా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం అంటే ఏం సంకేతాలు ఇస్తున్నట్టు?
ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చినా, ఇప్పటికీ టీడీపీ- బీజేపీ లాలూచీ, కుమ్మక్కు రాజకీయాలు కొనసాగుతున్నాయనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి?
వైయస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకను ఏ హోదాలో అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి.
పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు పలు ధపాలుగా ఫిర్యాదు చేశామని చెప్పిన విజయసాయిరెడ్డి.
అయితే, స్పీకర్ నిర్ణయం తీసుకోనందునే ఆమెను వైయస్ఆర్సీపీ డిప్యూటీ లీడర్ గా పిలిచామని సమర్థించుకునే ప్రయత్నం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంతకుమార్.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక లేఖ ఇవ్వకుండా.. ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను ఆహ్వానించడం ముమ్మాటికీ తప్పేనన్న విజయసాయిరెడ్డి.
ఈ విషయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళిన విజయసాయిరెడ్డి.
బుట్టా రేణుకను వైయస్ఆర్సీపీ డిప్యూటీ లీడర్ గా ఆహ్వానిస్తూ.. అఖిలపక్ష సమావేశంలో బోర్డు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన విజయసాయిరెడ్డి.
తక్షణం ఆ బోర్డును తొలగించకపోతే.. తాను అఖిలపక్ష సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తానని హెచ్చరించిన విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి వాదనను బలపరిచిన అన్ని ప్రతిపక్ష పార్టీలు.
దాంతో వెనక్కి తగ్గిన పార్లమెంటరీ పార్టీ నేత అనంతకుమార్.. ఆ వెంటనే బుట్టా రేణుక నేమ్ బోర్డు తొలగింపు.
అలానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని సమక్షంలోనే కోరిన విజయసాయిరెడ్డి.
విభజన హామీలపై ప్రధాని స్పందించలేదు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే చట్టం చేయాలని ప్రధానిని కోరిన విజయసాయిరెడ్డి.
అలానే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
కనీసం తెలుగు, ఇంగ్లీషు కూడా మాట్లాడటం రాని సారా వ్యాపారి అయిన సీఎం రమేష్ ను తెలుగుదేశం పార్టీ పార్లమెంటుకు పంపడం వల్ల తెలుగు వారి పరువును ఢిల్లీ వీధుల్లో తీస్తున్నారన్న విజయసాయిరెడ్డి.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంగ్లీషు రాదు. ఆయన కొడుకు లోకేశ్ కు తెలుగు కూడా రాదు.
వీళ్ళా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది?
వీళ్ళా రాష్ట్రం కోసం పోరాడేది..? అంటూ ప్రశ్నించిన శ్రీ విజయసాయిరెడ్డి.

















