చిచ్చరపిడుగు వరుణవి ఆటపాటలకు ముగ్ధులైన మెగాస్టార్.. జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలే ఈ శనివారం రాత్రి 9 గంటల బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన జీ తెలుగు సింగింగ్ రియాలిటీ షో ‘సరిగమప లిటిల్ చాంప్స్’ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా గ్రాండ్ ఫినాలే జనవరి 10 (శనివారం) రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విడుదలైన ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్న చిన్నారి వరుణవిని కలిసి ఆశీర్వదించారు.

షో ఆరంభం నుంచీ తన గాత్రంతోనే కాకుండా బుజ్జిబుజ్జి మాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది వరుణవి. తన ముద్దుముద్దు మాటలతో, అద్భుతమైన గాత్రంతో మెగాస్టార్ చిరంజీవిని కూడా ఫిదా చేసింది. ముఖ్యంగా ‘ఏం పిల్లో.. నీ ముక్కు మీద కోపం’ అంటూ ఈ చిన్నారి పాడిన తీరుకు మెగాస్టార్ ముగ్ధులయ్యారు. వరుణవి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన ఆయన, ఆమె భవిష్యత్తు బాధ్యతను, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తాను అందిస్తానని ఆమె తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వరుణవి ప్రతిభను కొనియాడుతూ, ఆశీస్సులు అందజేశారు. ఈ అపురూప కలయికలో సరిగమప లిటిల్ చాంప్స్ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకర్ సుధీర్, జడ్డీలుగా వ్యవహరిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్, వరుణవి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారి వరుణవి చిరంజీవితో కలిసి చేసిన అల్లరి మిస్ కాకుండా ఈ శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప లిటిల్ చాంప్స్ గ్రాండ్ ఫినాలేలో చూసేయండి. ఈ సీజన్ టైటిల్ పోరులో ఎవరు గెలవనున్నారో తెలుసుకోండి!
అంతేకాదు, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు అందిస్తున్న సంక్రాంతి స్పెషల్ ‘సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు’ ఈవెంట్ ప్రసారం కానుంది. ఈ వారంతం జీ తెలుగు అందిస్తున్న వినోదాన్ని మీరూ మిస్ కాకుండా చూడండి!

















