విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వహిస్తున్న సంవత్సరాంతపు నృత్యోత్సవాల్లో రెండవ రోజు కళాభారతి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ విద్యార్థులు 23 మంది గురువు శ్రీ జగన్నాధ రావు ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య రూపకం “కృష్ణం వందే జగద్గురుం” ప్రదర్శించారు..
కార్యక్రమానికి ముందుగా నేటి ముఖ్య అతిధి శ్రీ క్. వి. కృష్ణ కుమార్, MD K. R. N. సన్స్, కళాభారతి ప్రధాన కార్యదర్శి ‘శ్రీరామదాస’ డాక్టర్ రాంబాబు, గురు జగన్నాధ రావు, నర్సింగ్ రావు జ్యోతి జ్యోతి ప్రకాశనం చేసే సుభారభం చేశారు.
ముఖ్య అతిధి మాట్లాడుతూ విశాఖ కళలకు నిలయం అని, కళలను ప్రోత్సహిస్తూ, పోషిస్తూ కళాభారతి చేసున్న నిస్వార్ధ సేవ హర్షనీయం అని కొనియాడేరు. మా వంతు సాయం తప్పకుండ అందిస్తామని అన్నారు.
ముందుగా బెంగాలి అస్సోసియేషన్ 10 నిమిషషాలు చక్కటి ప్రారంభం ప్రదర్శన చేసేరు.
తర్వాత జరిగిన కృష్ణం వందే జగద్గురుం కూచిపూడి నృత్య రూపకంలో శ్రీకృష్ణుడి జననం గోవర్ధనగిరి, కాలింది మర్దనం, కంశసంహారం తదితర ఘట్టాలను అద్భుతంగా నృత్య రూపకంగా ప్రదర్శించి అధికంగా వచ్చిన ప్రేక్షకుల హర్షద్వానాలను చురుగొన్నారు.
భామాకలాపం నృత్యం అద్భుతంగా ప్రదర్శించేరు.
గురు శ్రీ జగన్నాధరావు ను ఘనంగా సత్కరించి కొనియాడేరు.
ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ కళాభారతి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ కేవలం 200 రూపాయలు మాత్రమే నెలకు ఫీజుగా తీసుకుంటూ నృత్యం నేర్పుతున్నదని, కొంతమందికి ఉచితంగా కూడా ప్రవేశం కల్పిస్తున్నామని మన కళలను భావితరాలకు అందించాలని ఉద్దేశంతో అతి తక్కువ ఫీజుతో సంగీత, నృత్య శిక్షణ ఇస్తున్నామని ఈ సదవకాశాన్ని అందురూ వినియోగించుకోవాలని కోరారు.
రేపటి కార్యక్రమంలో శ్రీ ప్రవీణ్ కుమార్ బెంగళూరు వాస్తవ్యులు భరతనాట్య నృత్య ప్రదర్శన ఉంటుందని తరువాత గాజువాక స్కూల్ ఆఫ్ మ్యూజిక్ శ్రీమతి ఉమా ఆధ్వర్యంలో 26 మంది చిన్నారులు కూచిపూడి రూపకం ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రదర్శించబోతున్నారని అందరూ వచ్చి ఆశీర్వదించి ప్రోత్సహించాలని కోరారు.

















