శంకర్ ఫౌండేషన్ విజనరీ ఇన్సైట్స్ వార్తాలేఖకు జాతీయ అవార్డు. . కంటి రోగులకోసం శంకర్ ఫౌండేషన్ నేత్ర ఆసుపత్రి నెలవారీ ప్రచురిస్తున్న విజనరీ ఇన్సైట్స్ వార్తాలేఖకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రశంసల వర్షం కురిపించారు., శంకర్ ఫౌండేషన్ నెలవారీ వార్తాలేఖ ‘విజనరీ ఇన్సైట్స్’కు రెండవ బహుమతి లభించినందుకు ఆయన అభినందించారు. ఇది శంకర్ ఫౌండేషన్‌కు గర్వకారణమైంది. వార్తాలేఖను మరియు దానిలోని విషయాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు.ఈ నెల 13వ తేదీ రాత్రి డెహ్రాడూన్‌లో జరిగిన 47వ అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సును ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి తరపున రాజ్యసభ సభ్యులు నరేష్ బన్సల్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సులో విజనరీ ఇన్సైట్స్
ఎడిటర్, శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. బంగార్రాజు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ బన్సల్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు.
పీఆర్ఎస్ఐ జాతీయ చైర్మన్ డాక్టర్ అజిత్ పాఠక్,సెక్రటరీ జనరల్ డాక్టర్ పి.ఎల్.కె. మూర్తి మరియు ఇతర విశిష్ట ప్రముఖుల సమక్షంలో శంకర్ ఫౌండేషన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. జాతీయ స్థాయిలో ఈ గుర్తింపును శంకర్ ఫౌండేషన్ వరుసగా రెండవ సారి పొందడం గమనార్హం.
శంకర్ ఫౌండేషన్ చైర్మన్ Board of Trustees, ఎం. రాందాస్
మేనేజింగ్ ట్రస్టీ ఎ. కృష్ణకుమార్, ట్రస్టీలు ఎ. ప్రసన్న కుమార్, ఎ. విజయ కుమార్ మరియు జనరల్ మేనేజర్ కె. రాధాకృష్ణన్‌లతో కూడిన బృందం ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గౌరవాన్ని సాధించినందుకు గాను ‘విజనరీ ఇన్సైట్స్’ ఎడిటర్ కె. బంగార్రాజుకు మరియు సంపాదక బృందానికి అభినందనలు తెలియజేశారు
ఈ పురస్కారం నేత్ర వైద్య రంగంలో కమ్యూనికేషన్ మరియు ప్రజా అవగాహనలో శ్రేష్ఠత పట్ల శంకర్ ఫౌండేషన్ యొక్క అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతోంది. తద్వారా కంటి సంరక్షణలో విశ్వసనీయమైన స్వరంగా దాని పాత్రను మరింత బలోపేతం చేయనుంది. ఈ విజయం శంకర్ ఫౌండేషన్‌ను కంటి సంరక్షణ నిర్వహణలో జాతీయంగా మరింతగా గుర్తింపు తెచ్చింది.
ఫోటో శీర్షిక: 1) ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వార్తాలేఖలోని విషయాలను పరిశీలిస్తున్న దృశ్యం. 2) డెహ్రాడూన్‌లో విజనరీ ఇన్సైట్స్ ఎడిటర్ కె. బంగర్ రాజుకు ఎంపీ బన్సల్ అవార్డును అందజేసిన దృశ్యం.


















