HomeUncategorizedVisakhapatnam Vizagvision:విద్యాభారతి స్వర్ణజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, ఢిల్లీలో 2027 న జరగబోతున్న. అతిపెద్ద ఘోష్ శిబిరాన్ని నిర్వహించాలనే యోజనతో ఈ రోజు విశాఖపట్నం సిటీ భారతీయ విజ్ఞాన కేంద్రం పాఠశాలలు అన్ని కలిపి గాజువాక విజ్ఞాన భారతి పాఠశాల కేంద్రం గా విశాఖ సిటీ ఘోష్ పధసంచలన్ నిర్వహించడం జరిగినది. గాజువాక పాఠశాల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య జి. నాగేశ్వరరావు గారు జ్యోతిప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాభారతి, అఖిల భారతీయ ప్రాంత కార్యకారిణి మాన్యులు జె. కాశీపతి గారు వేదిక మీద మాట్లాడుతూ మన పాఠశాలలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే నేర్పును, కౌశలాన్ని, అభివృద్ధి చేసుకుంటారని, విద్యతో పాటుగా సంస్కారాన్ని, విలువలను ఆధ్యాత్మికతను ఇనుముడింప చేసుకుంటారని తెలియచేశారు. చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈరోజు డిసెంబర్ 11 వ తేదీ హిందూ స్వాభిమాన్ దివస్ సందర్భంగా ఐదు కేంద్రాలలో ఘోష్ పధ సంచలన్ ఒకే సమయానికి నిర్వహిస్తున్నామని, అఖిల భారతి స్థాయిలో అన్ని విషయములలో, అన్ని రంగములలో ముందు ఉండే ప్రయత్నం చేయాలని, ఘోష్ పధ సంచలన్ చేసే విద్యార్థిని విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథి శ్రీ. కే. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒకే వేదిక పై క్రమశిక్షణతో, సమయస్ఫూర్తితో, అంకిత భావంతో ఘోష్ పధ సంచలన్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బి.వి. కె. డైరెక్టర్ శ్రీమతి. అంజలి ప్రసాద్ గారు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీ. వి.వి.ఎల్. శ్రీనివాస్ గారు, ప్రధానాచార్య శ్రీమతి. మహాలక్ష్మి. వాడ్రేవు. ప్రాంత మరియు సమితి ఘోష్ ప్రముఖులు శ్రీ. ప్రసన్న గారు మరియు శంకర్ గారు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు కుమారి రమాదేవి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Visakhapatnam Vizagvision:విద్యాభారతి స్వర్ణజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, ఢిల్లీలో 2027 న జరగబోతున్న. అతిపెద్ద ఘోష్ శిబిరాన్ని నిర్వహించాలనే యోజనతో ఈ రోజు విశాఖపట్నం సిటీ భారతీయ విజ్ఞాన కేంద్రం పాఠశాలలు అన్ని కలిపి గాజువాక విజ్ఞాన భారతి పాఠశాల కేంద్రం గా విశాఖ సిటీ ఘోష్ పధసంచలన్ నిర్వహించడం జరిగినది. గాజువాక పాఠశాల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య జి. నాగేశ్వరరావు గారు జ్యోతిప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాభారతి, అఖిల భారతీయ ప్రాంత కార్యకారిణి మాన్యులు జె. కాశీపతి గారు వేదిక మీద మాట్లాడుతూ మన పాఠశాలలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే నేర్పును, కౌశలాన్ని, అభివృద్ధి చేసుకుంటారని, విద్యతో పాటుగా సంస్కారాన్ని, విలువలను ఆధ్యాత్మికతను ఇనుముడింప చేసుకుంటారని తెలియచేశారు. చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈరోజు డిసెంబర్ 11 వ తేదీ హిందూ స్వాభిమాన్ దివస్ సందర్భంగా ఐదు కేంద్రాలలో ఘోష్ పధ సంచలన్ ఒకే సమయానికి నిర్వహిస్తున్నామని, అఖిల భారతి స్థాయిలో అన్ని విషయములలో, అన్ని రంగములలో ముందు ఉండే ప్రయత్నం చేయాలని, ఘోష్ పధ సంచలన్ చేసే విద్యార్థిని విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథి శ్రీ. కే. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒకే వేదిక పై క్రమశిక్షణతో, సమయస్ఫూర్తితో, అంకిత భావంతో ఘోష్ పధ సంచలన్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బి.వి. కె. డైరెక్టర్ శ్రీమతి. అంజలి ప్రసాద్ గారు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీ. వి.వి.ఎల్. శ్రీనివాస్ గారు, ప్రధానాచార్య శ్రీమతి. మహాలక్ష్మి. వాడ్రేవు. ప్రాంత మరియు సమితి ఘోష్ ప్రముఖులు శ్రీ. ప్రసన్న గారు మరియు శంకర్ గారు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు కుమారి రమాదేవి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.