విశాఖ మ్యూజిక్ & డాన్స్ అకాడమీ- కళాభారతి వర్ధమాన కళాకారులను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంవత్సరం ఆలిండియా రేడియో నుంచి గ్రేడింగ్ పొందిన వర్ధమాన కళాకారులను 8మందిని (నలుగురు గాత్రంలో, ఇద్దరు వైయోలిన్ లో,ఇద్దరు మృదంగం వాయించే వారిని ) ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి వారి ప్రతిభను చూపించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.


విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అటు ప్రపంచవ్యాప్త కళాకారులనే కాకుండా చిన్న కళాకారులకు కూడా ఈ వేదిక ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని ఈరోజు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది.
ముందుగా అధ్యక్షులు శ్రీ ఎం ఎస్ ఎన్ రాజు, కార్యదర్శి ‘శ్రీరామదాస’ డాక్టర్ రాంబాబు, శ్రీ పంతుల గోపాలరావు, శ్రీ M. S. N. మూర్తి, Dr. పంతుల రమ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు.
అధ్యక్షులు మాట్లాడుతూ పెద్ద కళాకారులను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించడం ఎవరైనా చేస్తారు కానీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ బాగా టాలెంట్ఉన్న కళాకారులనకి అవకాశం ఇచ్చే ప్రక్రియ మేము చేపడుతున్నాము అని అన్నారు.
తర్వాత జరిగిన కచేరీలో నలుగురు కళాకారులు కూడా ఎంతో ప్రతిభ చూపిస్తూ అటు రాగాలాపన, స్వరకల్పన, నెరవు అన్నింట్లోనూ సీనియర్ కళాకారులకు తీసుపోని విధంగా ప్రదర్శించి వచ్చిన ప్రేక్షకుల హర్షద్వానాలను అందుకున్నారు.
కచేరీలు భాగంగా
- గంగనపతే – హంసధ్వని రాగం – త్రిశ్ర అది తాళం – హరికేసనాల్లూరు ముత్తయ్య భగవతర్ రచన
- గోవర్ధన గిరీషం – హిందోళం – రూపకం – ముత్తుస్వామి దిక్షితర్ వారి కృతి
- మా జానకి – కంభోజీ రాగం – అదితాళం – త్యాగరాజ స్వామి వారి కీర్తన,
- మామవ పట్టాభిరామా – మణిరంగు రాగం – మిశ్రచాపు – ముత్తుస్వామి దిక్షితర్ వారి కీర్తన,
- షణ్ముఖప్రియ రాగం తానం పల్లవి – ద్వినాడై చతురస్ర ట్రిపుతా ళం,
- మరియాద తెలియకనే – సురుటి రాగం – రూపకం తాళం – పట్నం సుబ్రమణ్య అయ్యర్ వారి కృతి,
- ఎంత మాత్రమున – రాగమాలిక – మిశ్రచాపు – అన్నమాచార్య వారి కీర్తన,
- బేగడ తిల్లన – అది తాళం – Dr. పంతుల రమ రచించిన తిల్లాన
- పవమాన – సౌరాష్ట్రం – అది – త్యాగరాజ స్వామి – మంగళం తో కచేరి అత్యంతగా రాసరమ్యంగాగానంచేసి ముగించారు.
గాత్రం కుమారి గాయత్రి వరేణ్య, కుమారి ఇవ్వటూరి కృష్ణ శృతి., కుమారి మహతి కుమారి ప్రీతి అలాగే violin పై శ్రీ పంతుల సాకేత్ (USA), శ్రీ ఆదిత్య, మృదంగంపై, శ్రీ. యువరాజ్, చాణిక్య చంద్ర
సహకరించి శభాష్ అనిపించుకున్నారు.
చివరిలో కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ దీపావళి ముందు రోజు నరక చతుర్ధసి నాడు శ్రీ ముత్తుస్వామి దీక్షితశ్రీ ముత్తుస్వామి దీక్షిత వారి వర్ధంతిర్ వారి వర్ధంతి ఉంటుందని కాని పండుగ పూట ప్రేక్షకులకు రావడానికి ఇబ్బంది ఉన్నందున ఈ నెల 26వ తారీకు అంటే ఆదివారం నాడు శ్రీమతి లలితా చంద్రశేఖర్ వారి ఆధ్వర్యంలో వారి తోపాటు సుమారు 55 మంది గాయనీ గాయకులు వేదికపై కూర్చుని ముత్తుస్వామి దీక్షిత్ గారి కీర్తనలు పాడబోతున్నారని ఆ కార్యక్రమానికి ప్రేక్షకులు అధికంగా విచ్చేసి విని ఆనందించి ప్రోత్సహించి చివరిలో మూడు రకాల ప్రసాదాలు అందరూ బోజన రూపేనా సేవించి వెళ్ళవలసిందిగా మనవి చేశారు..

















