కళలకు నిలయం కళాభారతి. సంగీతం, సాహిత్యం, నృత్యం నాటకం,తోలుబొమ్మలాట హరికథలు,బుఱ్ఱకథలు, ఇలాగ వివిధ కార్యక్రమాలతో నిత్యం విరాజిల్లుతొంది
కళాభారతి ప్రాంగణం. అలాగే కళలకు రాజధానిగా విరాజిల్లుతోంది మన విశాఖ నగరం.

కళాభారతి గత 24 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆగస్టులో జాతీయ పురస్కార సభ మరియు ఆరురోజులు సంగీత నృత్య నాటక ఉత్సవాలు నిర్వహిస్తోంది.
2025వ సంవత్సరం ఆగస్టు 23 నుంచి 28 వరకు ఆరు రోజులు పాటు ఉత్సవాలు జరుగనున్నాయి .
23వ తారీఖున ప్రఖ్యాత వైయోలిన్ విద్వాంసులు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ ద్వారం దుర్గాప్రసాద్ రావు గారికి “నాద విద్యా భారతి’ బిరుదుతో సత్కారం, రెండున్నర లక్షల విలువచేసే స్వర్ణకమలం, ఒక లక్ష రూపాయలు నగదు బహుమతి, నూతన పట్టువస్త్రాలు, ప్రశంశాపత్రం, ఇచ్చి సత్కరిస్తున్నామని తెలియ జేసేరు అధ్యక్ష కార్యదర్సులు.
ఈ సత్కారాన్ని విజయనగర సంస్థనాదీసులు మహారాజులు ప్రస్తుత గోవా గవర్నర్ గారు అయినటువంటి His Excellency శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజుగారు ముఖ్యఅతిథిగా, అలాగే విశాఖ వాస్తవ్యులు ప్రముఖ న్యాయవాది హైకోర్టు న్యాయవాదిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ శ్రీ డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు గారు గౌరవ అతిథిగా వారిరువుల చేతుల మీదుగా ఈ బిరుదు ప్రదాన మహోత్సవం సాయంత్రం 6:15 ని జరుగుతుంది.
సత్కార సభ ఆయన వెంటనే 7:30 కు “సంగీత సుధానిది ” విద్వాన్ శ్రీ ద్వారం సత్యనారాయణ గారి వాయులీన వాయిద్య కచేరి ఉంటుంది. వారికి వైలెన్ పై సహకారం విద్వాన్ శ్రీ నీలాద్రి రావు, ప్రముఖ మృదంగ విద్వాంసులు “సంగీత కళాభారతి” డాక్టర్ వంకాయల వెంకటరమణ గారు మృదంగం పైన, ఘట వాయిద్య విద్వాంసులు శ్రీ హనుమంతరావు గారు ఘటం పైన సహకరించనున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని రోజులు అన్నీ కార్యక్రమాలు కూడా యుగళం ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది.
రెండవ రోజు 24వ తేదీ ముఖ్య అతిథిగా Vice Admiral, పరమ విశిష్ట సేవ పురస్కార గ్రహీత, PVSM, AVSM, VSM, FALG OFFICER COMMANDING IN చీఫ్, Easter Naval Command Sri Rajesh Pendarkar ముఖ్య అతిథిగా విచ్చేసి ఆరోజు జరిగే కర్ణాటక గాత్రం హిందుస్థానీ గాత్రం ఇద్దరు విద్వాంసులు పూర్ణిక కృష్ణన్ ముంబై, విద్వాన్ నివేదిత భట్టాచార్జీ కోల్కతా, వీరు ఇరువురు కలిసి హిందుస్తానీ కర్ణాటక గాత్ర సంగీతంలో జుగల్బందీ ఉంటుంది. విద్వాన్ శ్రీమతి మంతా శ్రీ రమ్య వైయోలిన్ పైన, మృదంగంపై విద్వాన్ శ్రీ పారుపల్లి ఫాల్గుణ , అలాగే హిందుస్థానీలో విద్వాన్ శ్రీ రాయి హార్మోనియం పై & విద్వాన్ శ్రీ సహా తబల పై సహకరించనున్నారు. ప్రప్రధమంగా జరుగుతున్న జుగల్బంది సంగీతానికి అందరూ అధికంగా రావాలని కోరుతున్నాము.
మూడవ రోజు కార్యక్రమంలో( 25/8/2025 సోమవారం ) పేరుగాంచిన ప్రముఖ కర్ణాటక గాత్ర విద్వాంసులు విష్ణుభట్ల సిస్టర్స్ గా ప్రసిద్ధిగాంచిన వారి గాత్ర యుగళం ఉంటుంది. వీరికి వైయోలిన్ విద్వాంసులు ‘సంగీత సుధానిది’ Dr. మావుడూరు సత్యనారాయణ శర్మ వైలెన్ పై, ‘లయ ప్రవీణ’ శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగంపై, ‘లయ శిరోమణి’ విద్వాన్ శ్రీ హరిబాబు ఘటంపై సహకరించనున్నారు.
నాలుగవ రోజు 25వ తారీఖున (మంగళవారం) మరొక యుగళం. కర్ణాటక సంగీత యుగళ గాత్రంలో పేరుగాంచిన ప్రఖ్యాత బెంగళూరు బ్రదర్స్ వారిద్దరి కర్ణాటక గాత్ర సంగీతకచేరి ఉంటుంది. వారికి స్థానిక ప్రముఖ విద్వాంసులు ‘సంగీత కళాభారతి, బిరుదాంకితులు శ్రీ M S. N.మూర్తి వైయోలిన్ పై, ‘సంగీత కాళాభారతి” బిరుదాంకితులు డాక్టర్ వంకాయల వెంకటరమణ మూర్తి మృదంగంపై, ‘లయ శిరోమణి’ హరిబాబు ఘటంపై సహకరిస్తున్నారు..
5వ రోజు 27/8/2025 బుధవారం నాడు
‘భారత కళా గ్రామ నాట్య గురుకులం’ బెంగళూరు వారు డాక్టర్ ఆర్. వసంత కిరణ్ ఆధ్వర్యంలో 33 మంది నృత్య కళాకారులతో ” హరిలీలా కల్పతరువు ” అనే కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించబోతున్నారు.
చివరగా ఆఖరి రోజున 28వ గురువారం నాడు డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారిచే గొప్ప చారిత్రాత్మక పద్య నాటకం “శ్రీ ఖడ్గ తిక్కన ” రచన దర్శకత్వం డాక్టర్ పి. వి.ఎస్. కృష్ణ, 38 మంది నటనటీమణులతో ఉంటుంది.
ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రవేశం ఉచితం. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.
ప్రేక్షకులు అధికంగా విచ్చేసి సంగీత నృత్య నాటకాలను చూసి ఆనందించి, ప్రోత్సహించి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఎం.ఎస్.ఎన్.రాజు అధ్యక్షులు, “శ్రీరామదాస” డాక్టర్ గుమ్ములూరి రాంబాబు కార్యదర్శి, కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, శ్రీమతి గ్రంధి మల్లిక మనోజ్ ట్రస్టీ, మేనేజర్ శ్రీ మోహనదాస్, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమాల ఇన్విటేషన్ విడుదల చేసేరు.
ఈ కార్యక్రమాలకు ఆర్ధిక
సహకారం లో భాగంగా మొదటిరోజు కార్యక్రమానికి Rs. 2.50 లక్షలు SRK INFRA Projects చైర్మన్ శ్రీ MSN రాజు, మొదటినుంచి అంటే గత 24 సంవత్సరాలుగా Rs. 2.50 విలువచేసే స్వర్ణ కమలంని MD వైభవ్ జ్యులరస్ శ్రీమతి మల్లిక మనోజ్, శ్రీ C. S. N. రాజు, శ్రీ CVS సూరి, శ్రీ DSN రాజు ట్రస్ట్, శ్రీ అన్నంరాజు సత్యనారాయణమూర్తి
శ్రీ పైడా కృష్ణ ప్రసాద్,
కంకటాల సిల్క్స్, సాముద్ర సాఫ్ట్ వేర్ వారు ఆర్ధికంగా సహకరించినందుకు ధన్యవాదములు తెలియజేసేరు.















