ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ వేడుకలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి.
హిందూ క్యాలెండర్ కాలమానం ప్రకారం…2024 లో పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి జనవరి 22 న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జరిగింది.
తిథి ప్రకారం… ఈ సారి జనవరి 11 న వచ్చింది.
దీన్ని అనుసరించి అయోధ్యలో ఈరోజు నూతన రామాలయ మొదటి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.
















