విశాఖ MP ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమం..
పోలీసుల అదుపులో నలుగురు దుండగులు :
నలుగురు దుండగులు కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడిని హేమంత్గా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది.
రౌడీ షీటర్ హేమంత్ పై 2 కిడ్నాప్, ఓ మర్డర్ కేసు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. హేమంత్ ఈ కిడ్నాప్ ద్వారా రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది..
ఎంపీ పోలీసులకు ఇచ్చిన సమాచారం ఆధారంగానే… పోలీసులు దర్యాప్తు చేసినట్లు తెలిసింది. అందువల్లే త్వరగానే ఈ కేసును పోలీసులు ఛేదించారని తెలుస్తోంది. హేమంత్ తరచూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గొడవలు పడుతూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా అతనిపై ఇలాంటి కేసులు ఉన్నాయి. అందువల్ల ఈ కిడ్నాప్ ఘటన జరగగానే.. ఇందులో హేమంత్ పాత్ర ఉండొచ్చనే అనుమానాలు కలిగినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఈ కేసును త్వరగా ఛేదించారని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు కాబట్టి… ఈ కథ సుఖాంతం అయిందనే అనుకోవచ్చు. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చెయ్యాల్సి ఉంది..
















