రేపటి (శనివారం) నుండి రెండు రోజులుపాటు ఏయు లో జాబ్ మేళా
దిగ్గజ కంపెనీలతో కలిపి పాల్గోనున్న 203 కంపెనీలు
9 బ్లాకులలో జాబ్ ఇంటర్వ్యూలు

శనివారం ఉదయం ఏయు కన్వెన్స్ హాల్లో ప్రారంభోత్సవం
వైఎస్ఆర్సిపి ఆద్వర్యంలో ఈ నెల 16,17 తేదీలలో తిరుపతిలో నిర్వహించిన జాబ్ మేళా పెద్ద ఎత్తున విజవంతంకావడంతో, అదే స్పూర్తితో విశాఖపట్నంలో రేపటి నుండి రెండు రోజుల పాటు విశాఖపట్నంలో నిర్వహించినున్న జాబ్ మేళాకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిరుద్యోగులకు వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాల కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పర్యవేక్షణలో తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహించతలపెట్టారు. మెదటి జాబ్ మేళా తిరుపతిలో విజయతవంతంగా పూర్తిచేసుకొని విశాఖపట్నంలో 23, 24 తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర యూనివర్శిటీ, ఇంజనీరింగ్ కాలేజ్, వైవిఎస్ మూర్తి ఆడిటోరియం సమీపంలో మొత్తం 9 బ్లాకులలో వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఒక్కో బ్లాక్ లో 10 నుండి 30 వరకు కంపెనీలకు సంబందించి ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. టెక్స్ టైల్స్, ఇంజనీరింగ్, ఎంటర్ టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), రిటైల్ సెక్లార్, సేల్స్ అండ్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, మాన్యుఫాక్చరింగ్, ఆటోమోటివ్ సెక్టార్, పార్మా, ఫార్మసి, ఇన్స్యూరెన్స్, ఎన్ బి ఎఫ్, సి, బ్యాంకింగ్ సెక్టర్, బిపిఓ, టెలీకమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, హాస్టిటాలిటీ, సెక్యూరిటీ విభాగాలకు చెందిన 203 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెక్స్ టైల్స్ రంగానికి సంబందించి ఇంజనీరింగ్ మెయిన్ బ్లాక్, ఇంజనీరింగ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కు సంబందించి జియో ఇంజనీరింగ్ బ్లాక్, ఐటి రంగానికి సంబందించి సిఎస్ఈ, మెటాలర్జి, ఈసిఈ బ్లాక్, రిటైల్, సేల్స్ అండ్ మార్కెంటింగ్, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబందించి లెక్చర్ హాల్ కాంప్లెక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్లాక్, మాన్యుఫాక్లరింగ్ బ్లాక్ కు సంబందించి, ఇన్ట్రుమెంట్ టెక్నాలజీ (మాన్యుపాక్చరింగ్) బ్లాక్, ఆటోమోటివ్ సెక్లార్ కి సంబందించి ఆటోమోటివ్ కెమికల్ ఇంజనీరింగ్, ప్లేస్ మెంట్ సెల్ బ్లాక్, ఫార్మా, ఫార్మసి రంగాలకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ బ్లాక్, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్ సెక్లార్, ఎన్ బి ఎఫ్ సి, బిపిఓ, టెలీకమ్యూనికేషన్ రంగాలకు సంబందించి, ఐఏఎస్ఈ బిల్డింగ్ అండ్ ఎకనామిక్స్ బ్లాక్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, సెక్యూరిటీ, లాజిస్టిక్ రంగాలకు సంబందించి స్కూల్ ఆప్ సోసల్ సైన్సెస్ బ్లాక్ లలో ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి బ్లాక్ మందు పైన తెలిపిన వివరాలతో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్దులకు మరింత సమాచారం అందించేందుకు, అనుమానాలు నివృత్తి చేసేందుకు ఆయా బ్లాకుల వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి బ్లాక్ వద్ద ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మీడియా ప్రతినిధుల కోసం ప్రతిబ్లాక్ వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఏయు కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం జాబ్ మేళా ప్రారంభోత్సవం
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వైఎస్ఆర్ మెగా జాబ్ మేళాను శనివారం ఉదయం 8 గంటలకు ఏయు కన్వెన్షన్ హాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా జాబ్ మేళా యోక్క లక్ష్యం, ఉద్దేశ్యం వివరిస్తారు. తిరుపతిలో నిర్వహించిన మెదటి జాబ్ మేళాకు నిరుద్యోగులనుండి విశిష్ట స్పందన లభించింది. మెత్తం 7537 మంది ఉద్యోగాలు పొందారు. గరిష్టంగా రూ. 77000 నెలసరి జీతంతో ఎంపిక కావడం విశేషం. మూడవ జాబ్ మేళా ఈ నెల 30, మే1 తేదీలలో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ లో నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు.
సిబ్బందికి అవగాహన
శని, ఆదివారాలలో ఆంధ్రా యూనివర్సిటీలో జరగనున్న మెగా జాబ్ మేళాలో సీడాప్, ఏపిఎస్ఎస్ డిసి, ఏపీఈటీఏ, ఎంప్లాయ్ మెంట్ డిపార్ట్మెంట్, మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఉద్యోగులు నిర్వాహకులకు సహకరించనున్నారు. ఒక్కో బ్లాక్ వద్ద ఒక్కో యాంకర్ తో పాటు, 6 మంది సభ్యులు టీం నిర్వాహకులకు సహకరించాలన్నారు రు. టీం సభ్యులు, కంపెనీ ప్రతినిధులకు, ఉద్యోగార్దులకు మధ్య సమన్వయ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. యాంకర్లు, టీం సభ్యులు విధులు, బాధ్యతలపై జిల్లా బాబ్ మేనేజర్లు వివరించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఉద్యోగులు ఈ శిక్షణా తరుగతుల్లో పాల్గొన్నారు. జాబ్ మేళా నిర్వహణలో ఏయూ విధ్యార్దులు, సిబ్బంది తమదైన పాత్ర పోషించనున్నారు. కార్యక్రమంలో సీడాప్ చైర్మెన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, మిలీనియం సాఫ్ట్ వేర్ సోల్యూషన్స్ సిఈఓ శ్రీధర్ రెడ్డి, జాబ్ డిస్ట్రిక్ట్ మేజేనర్లు కళ్యాణి, చింతాడ రాంమ్మోహన్, మార్టిన్ లు పాల్గొన్నారు. ఆప్కాస్ జిఎం బి నాగ ప్రసాద్, ఏపిఎస్ఎస్ డిసి ప్రతినిధి సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.
















