విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ వ్యతికరేకిస్తుంది MP Vijaysai Reddy Visakhapatnam Vizagvision..విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక సంఘాల నాయకులతో సమావేశం అయిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్,ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, గొట్టేటి మాధవి, ఎమ్మెల్యేలు అమర్ నాధ్,తిప్పల నాగిరెడ్డి తదితరులు..నష్టాల్లో ఉన్న కేంద్ర సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఉక్క కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ వ్యతికరేకిస్తుంది. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభల్లోకి తీసుకురావాలి కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకూడదు. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించడంతో పాటుగా లోన్ ను ఈక్విటీ కింద మార్చి వడ్డీ భారం తగ్గించాలని కేంద్రంకి మా నుండి సూచన చెయ్యడం జరిగింది.. మూడో ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లాంట్ ను ఎన్.డి.ఎం.సి తో గాని, సైల్ తో గాని విలీనం చెయ్యాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులను కేటాయిస్తే కచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుంది.. ఎక్కడో ఉన్న గనులను కాకుండా దగ్గరలోని సాలూరు, కొటియ గ్రామాల వద్ద ఉన్న మైన్స్ ని కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. ఉక్కు కర్మిక సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకెళ్ళి ఇటివల కొత్తగా వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ అంశాలను వివరిస్తాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బీజేపీ ఏతర పక్షాలను కలుపుకొని పార్లమెంట్ లోపల బయట తము నిరసన తెలియచేస్తాము. జంతర్ మంతర్ లో 2 రోజుల పాటు నిరసన తెలపాలి అని కార్మిక సంఘాలు నిర్ణయించారు.ఈ నిరసన కార్యక్రామానికి తము సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు ఇతర పార్టీల మద్దతు కుడగడతాము.. #Vizagvision #SteelPlantPrivatization VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/

















