విశాఖ మన్యంలో గంజాయి, లేట్ రైట్ వ్యాపారం టీడీపీ నేతలే MLA గుడివాడ అమర్ నాద్ in Visakhapatnam Vizagvision…చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను పెంచి పోషించారని, చీమకుర్తి, పల్నాడు ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల మైనింగ్ గనులను టీడీపీ పెద్దలు మింగేశారని వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. లేటరైట్ ముసుగులో టీడీపీ పెద్దలు బాక్సైంట్ తవ్వి పెద్దఎత్తున ఎగుమతులు చేసుకున్నారని, ఇందులో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు కూడా ఉన్నారని, వారిపై రూ. 20 కోట్లు జరిమానా వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దొంగే.. దొంగ అని అరచినట్టుగా టీడీపీ హయాంలో ఎవరైతే మైనింగ్ మాఫియాకు పాల్పడ్డారో, అటువంటి మైనింగ్ మాఫియా ముఠా సభ్యులే ఈరోజు అక్రమ మైనింగ్ అంటూ గోల చేస్తూ, హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మన్యంలో మైనింగ్ కు కొత్తగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని, హైకోర్టు అనుమతితోనే లేటరైట్ మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క చీమకుర్తి ప్రాంతంలోనే రూ. 2500 కోట్ల మైనింగ్ అక్రమంగా తవ్వేశారు.. పల్నాడులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వందల కోట్ల లైమ్ స్టోన్ గనులు మింగేశారు అని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోందని.. వేల కోట్ల రూపాయలు జరిమానాలు విధించిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా మైనింగ్ విధానం అమలు చేస్తున్నాం.. టీడీపీ పెద్దల అక్రమాలు తవ్వి తీస్తుంటే మాపై నిందలు మోపడం టీడీపీ పెద్దలకే చెల్లిందని విమర్శించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు మైనింగ్ దాహానికి మాజీ గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు బలి అయింది నిజం కాదా అని ప్రశ్నించారు. అయిదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ నేతలు అక్రమ మైనింగ్‌తో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేశామన్నారు. బాక్సైట్ తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని 2015లోనే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు స్పష్టం చేశారన్నారు. గిరిజనులు పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్దిని ఏ రాజకీయ పార్టీ శంకించాల్సిన అవసరం లేదన్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/

















