ఈ నెల 14వ తేదీనుంచి శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం జరగనుంది. ఇందుకోసం చందనం అరగదీత కార్యక్రమం ఈ నెల ఏడోతేదీ నుంచి జరగనుంది. ఇందుకోసం రాళ్లను - చందనపు చెక్కలను సిద్ధం చేశారు. తొలి విడతగా 32 కేజీల మేలురకపు గంధపు చెక్కలను అరగదీయనున్నారు. ఏర్పాట్లను స్థానాచార్యులు , ప్రధాన అర్చకులు , స్థానాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం, సింహాచలం విశాఖపట్నం జిల్లా- శ్రీ స్వామివారి దేవస్థానంలో తేదీ 14-05-21 (శుక్రవారం) శ్రీస్వామివారి చందనోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి గారు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఈఓ సూర్యకళ గారు, ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ ప్రభావం, దేశంలో పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలమేరకు చందనోత్సవం ఏకాంతంగానే జరపబడును. అయితే భక్తుల సౌకర్యార్థం శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజను నిజరూప స్వామి ఎదురుగా నిర్వహించాలని నిర్ణయించడమైనది. సంప్రదాయం ప్రకారం శ్రీ స్వామివారి చందనోత్సవం రోజున అంటే (14-05-21), వైశాఖ పౌర్ణమిరోజున, జ్యేష్ఠ పౌర్ణమిరోజున మరియు ఆషాడ పౌర్ణమి రోజున మొత్తం నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేయబడును. ఈ చందన సమర్పణలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ 11257208642, IFCS code SBIN 0002795కు గాని భక్తులు విరాళాలు పంపించవచ్చు. అర కేజీ చందనం సమర్పణకోసం రూ. 10,116 (పదివేల నూటపదహార్లు) పంపవలెను, కేజీ చందన సమర్పణకోసం రూ. 20,116(ఇరవైవేల నూటపదహార్లు) భక్తులు పై అకౌంట్ కు పంపించగలరు. చందన సమర్పణకోసం డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ , ఫొటో తీసి , మీ అడ్రస్ 6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా పంపించగలరు. అరకేజీ చందనం సమర్పించేవారికి చందనం ముక్కలను ప్రసాదంగా పంపించబడును. కేజీ చందనం సమర్పించినవారికి (రూ.20,116)అదనంగా స్వామివారి శేషవస్త్రం ముక్క కూడా పోస్టులో పంపించబడును. విరాళాలను 13-05-21 (గురువారం) లోగా పంపించగలరు. ఎంత చందనాన్నైనా భక్తులు సమర్పించుకోవచ్చు.
విరాళములు మరియు రూ.1116 (వెయ్యి నూటపదహార్లు) శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజకు పంపిచే భక్తులు గోత్రనామములతో పూజలు జరపించబడును. ఈ విరాళాలు సర్పించిన వారు సైతం స్క్రీన్ షాట్, ఫొటో తీసి, అడ్రస్, గోత్రనామాలు 6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. భక్తులు ఈ అరుదైన, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనోత్సవంలో భాగస్వాములై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి.

NOTE : ఇందులో భాగస్వాములైన భక్తులు – మొత్తం చందనోత్సవ కార్యక్రమాన్ని కళ్యాణ మండపంలోనుంచి ఇచ్చే లైవ్ ద్వారా వీక్షించొచ్చు. తమ గోత్రనామాలు చదివారో లేదో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు. చందనోత్సవానికి విరాళాలు పంపించాలనుకునేవారు… 13-05-21(గురువారం)లోగా పంపించగలరు. ఏమైనా సలహాలు, సందేహాలుంటే ఇదే నంబర్ 6303800736కు పోన్ చేయగలరు.















