Tributes Were Paid to Video Journalist Partha Saradhi by CameraMans VSCVJWA in Visakhapatnam,Vizagvision…కరోనా లో విధుల్లో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతి లో సీనియర్ వీడియో జర్నలిస్ట్ గా విధుల నిర్వహిస్తున్న పార్థసారథి ఇటీవల కోవిడ్ 19 తో మృతి చెందారు….ఆయన మృతికి విశాఖ లో విశాఖ స్మార్ట్ సీటీ వీడియో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద
ఘనంగా కోవొత్తులతో నివాళులు అర్పించారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా vjf అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ నిరంతరం వార్త సేకరణలో ముఖ్య పాత్ర పోషిస్తూ కరోన తో మృతి చెందిన పార్థ సారధి కి నివాళి అర్పించారు..అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం వార్త సేకరణలో ముందు వరుసలో ఉండేది వీడియో జర్నలిస్ట్లు అని కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలను పక్కన బెట్టి వృత్తి లో ముందు ఉంటున్నారు అని తెలిపారు..ఆయన మృతి తీరని లోటని కొనియాడారు..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు

















