లాక్ డౌన్ తో…గర్భిణి నరకయాతన,కొత్తూరు మండలం in Srikakulam,Vizagvision…
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం
లక్ డౌన్ తో…గర్భిణికి నరకయాతన
శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు మండలం అల్తీ గ్రామంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ విజృంభణ వేళ విధించిన లాక్‌డౌన్‌తో ఓ గర్భిణి నానా అవస్థలు పడుతూ నరకయాతన అనుభవించింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు మండలంలోని అల్తీ పంచాయతీ దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఏఎన్ఎం సవరమ్మ, ఆశా కార్యకర్తలు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దిగువరాయిగూడ నుంచి ఒడిశా సరిహద్దు వరకు ఆటోలో తీసుకువచ్చారు. రెండు రోజుల క్రితం అల్తీ పంచాయతీకి వెళ్లే రహదారిని మిలగాం వద్ద ఒడిశా అధికారులు రహదారినీ తవ్వేశారు. దీంతో ఆమెను ఆటో నుంచి దింపి డోలి సహాయంతో మోసుకెళ్లి మిలగాం దాటించారు. స్థానిక అధికారుల సహకారంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో కొత్తూరు సామాజిక ఆసుపత్రికి చేర్పించి వైద్య అందిస్తున్నారు.
















