ఈ నెల 26న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ మహోత్సవానికి శనివారం ఉదయం 7.30 గంటలకు చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆలయ ప్రధానార్చకులు, పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అనంతరం వేద మంత్రోచ్ఛ రణ, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా అరగదీత ప్రారంభమైంది. 33.800 కేజీల చందనం చెక్కలను అరగదీసి ఈ నెల 26న వైశాఖ శుద్ధ తదియ ఆదివారం స్వామి వారి చందనోత్సవానికి గంధం సిద్ధం చేయనున్నారు. దేవస్థానం ఈవో వేంకటేశ్వర రావు పూజల్లో పాల్గొన్నారు

















