The Akshaya Patra Foundation Distribution Essential Grocery Box in Visakhapatnam,Vizagvision..కరోనా లాక్ అవుట్ రోజులలో హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి ఆదరణ
కోవిద్ -19 రిలీఫ్ పోగ్రామ్
హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు కోవిద్ రిలీఫ్ ప్రోగ్రాం ద్వారా ఇన్ఫోసిస్ వారి సహకారముతో విశాఖపట్నం లో మొదతి విడతగా 2600 మందికి రొండోవ విడతగా ౩౦౦౦ మందికి 10 రోజులకు సరిపోవు రోజువారీ సరుకుల ప్యాకేట్లను హరే కృష్ణ మూవ్మెంట్ వాలంటీర్స్ ద్వారా నిరుపేదలకు తమవంతు సాయముగా అందచేయడం జరుగుతుంది .
ఈ కిట్స్ నందు భద్రపరిచిన సరుకులు పట్టిక
బియ్యం , కందిపప్పు , శనగపప్పు , వంటనూనె ,పసుపు , జిలకర , ధనియాలు పొడి , సాంబార్ మసాలా , గరంమసాలా మరియు ఊరగాయ . వీటిలో నిలువ వుండు కూరగాయలు బంగాళాదుంప , ఆనపకాయ . ఈ కిట్టు ద్వారా ౨౧ రోజులు ఒక వ్యక్తి రొండు పూటలా భోజనం చేయగలుగుతారు .
మొదతి పంఫిణీ చేయబడిన ప్రదేశాలు
హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ వాలంటీర్స్ నిరుపేదలు వున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ ఇంటి ఇంటి కి పంఫిణీ చేయడం జరిగింది .
1.ఋషి కొండ
2.ఓల్డ్ పోస్ట్ ఆఫీస్
3.కుమ్మరవీధి
4.పాండు రంగాపురం అపార్ట్మెంట్ పనిచేయు పనివారు
5. గంభీరం
6.అప్పికొండ
7. గోపాల పట్నం భాజీ జంక్షన్
8. ఎంవీపీ కాలనీ ఇళ్లలో పనిచేయు పనివారు
కష్ట కాలములో వున్న వారికీ తమవంతు సామజిక భాద్యత గా పంఫిణీ చేయడం జరిగింది .
ఈ రోజు రొండోవ విడత 3000 పాకెట్స్ గీతం కాలేజీ నందు హరే కృష్ణ మూవ్మెంట్ భక్తుల వాలంటీర్స్ సహకారముతో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కిట్స్ తయారు చేయడం జరిగింది .
ఈ కిట్స్ తయారీ కొరకు 100 మంది స్టూడెంట్స్ అండ్ వాలంటీర్స్ మరియు పంఫిణీ కొరకు 50 మంది వాలంటీర్స్ పనిచేయుచున్నారు .
ఇవికాకుండా ప్రతి రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాల నుంచి ౫౦౦౦ వేలమంది కి భోజనం తయారు కావించి పంపిణి చేయడం జరుగుతుంది . ఈ కార్యక్రమములో 45 మంది వాలంటీర్స్ పనిచేయు చున్నారు .
మధ్య మరియు దిగువతరగతి వారికీ జిల్లా అధికారుల సమాన్వ్యముతో పంపిణి చేయడం జరుగుతుంది .ఈ కార్యక్రమము కార్పొరేట్ సంస్థలు , వ్యక్తిగత దాతలు , మరియు స్వచ్చంద కార్యకర్తలు నిస్వార్ధముగా ముందుకు వచ్చి భోజన పంపిణి లేక ఫుడ్ రిలీఫ్ కిట్స్ పంపిణి చేయుచున్నారు .
భోజనం తయారు చేయు భాద్యత అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాల నందు తయారు చేయడం జరుగుతుంది . తయారు కాబడిన భోజనం దాతలు ద్వారా పోలీస్ వారికీ , మరియు నిరాశ్రయుల షెల్టర్లు నందు పంపిణి చేయుచున్నాము .
ఈ కార్యక్రమములో పనిచేయుచున్న వాలంటీర్స్ మరియు స్టూడెంట్స్ సేవలను హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు ప్రశంసించారు .
కోవిద్ -19 వ్యాధి చైనా లో మొదలై ప్రపంచమంతా వ్యాపిచింది, దేని కారణం ప్రధమముగా ఆరోగ్యము క్షిణించి ప్రాణాలు హరించి ధమే కాకుండా యావత్ ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మందగమనములోకి నెట్టివేయడం జరిగింది .ప్రపంచ జనాభాలో మన భారత దేశం రొండోవ స్థానము , ప్రస్తతం విపత్కర పరిస్థితులలో మన ప్రభుత్వమూ కఠిన మైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది .
కోవిద్ -19 నుంచి రక్షింపబడుటకు మన ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయము తీసుకోవడం జరిగింది . ఈ నిర్ణయము కారణముగా దిగువ తరగతులు , మధ్య తరగతి , వలస వచ్చినవారు మరియు నిరాశ్రుయులు భోజనము కొరకు అవస్థలు పడుచున్నారు.
ప్రభుత్వం లాక్ డౌన్ సమయములో ప్రజల కొరకు అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది . ప్రస్తుత కోవిద్ -19 పరిస్థితులలో హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ దేశ వ్యాప్తముగా అనేక రకరకాల కార్యక్రమములు చేపట్టడం జరిగింది . అందులో 10 రోజులకు ఒక కుటుంబముకు సరిపడా కావలసిన సరుకులను మరియు నిరాశ్రయాలకు ఆహార పంపిణి చేయడం
విశాఖపట్నం మరియు చుట్టూ ప్రక్క ప్రాంతాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఫుడ్ రిలీఫ్ కిట్స్ సాధ్యమైన అంత మేరకు అందచేయడం జరుగుతుంది .
నేటి నుంచి ఈ కిట్స్ పంపిణి చేయడం జరుగుతుంది
దాతలు విరాళాలుఅందచేయుట కొరకు టచ్ స్టోన్ చారిటీస్ , విశాఖపట్నం యాక్సిస్ బ్యాంకు, ఎంవీపీ కాలనీ కస్టమర్ఐ డి :86659066 అకౌంట్నెంబర్ :916010038104445 IFSC CODE:UTIB0000557
















