Distributing 400 Lunch Packets by Sai Pooja Foundation & Shivoham Trust in Visakhapatnam,Vizagvision…
వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో విశాఖలో రోడ్లపై ఆకలితో అలమాటిస్తున్న అభాగ్యులకు, వృద్దులకు,కళాసి కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు, పారిశుద్ధ్య కార్మికులకు *సాయి పూజా ఫౌండేషన్ మరియు శివోహమ్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో భోజన ప్యాకెట్లను ఆదివారం అందజేశారు.* సాయి పూజా ఫౌండేషన్ ఛైర్మన్,27 వ వార్డు మాజీ కార్పొరేటర్(31 కొత్తది) వానపల్లి రవికుమార్, శివోహమ్ ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ఎస్ మురళి లు పంపిణీ చేశారు.
ఆదివారం మధ్యాహ్నం సీతంపేట, జగదాంబ, సరస్వతీ పార్క్, ఎల్లమ్మ తోట, స్ప్రింగ్ రోడ్, బారక్స్ ఏరియా, డాబాగార్డెన్స్ , శెట్టిబలజి సంగం, ఆర్టీసీ కాంప్లెక్స్,అక్కయ్య పాలెం, సూర్య జంక్షన్, లాసెన్స్ బే కాలనీ, ఎమ్ వి పి కాలనీ, సిరిపురం, పెదవాల్తేరు తదితర ప్రాంతాల్లో 400 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.
కార్యక్రమంలో వార్డు కార్యదర్శి సారిపల్లి మహేష్,మోహన్, రాజు, సూరిబాబు, నాని, శ్రీను, అర్జీ శంకర్ రావు,శెట్టిబలజీ సంఘం సభ్యులు కొండలరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు

















