Chandrababu Tour : High Tension at Visakha Airport TDP Vs YSRCP in Visakhapatnam,Vizagvision…తెదేపా, వైకాపా పోటాపోటీగా నినాదాలు విశాఖపట్నం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబును విమానాశ్రయం దగ్గరే అడ్డుకోవాలంటూ పలువురు వైకాపా నాయకులు.. కార్యకర్తలకు సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చారు. మరో వైపు వైకాపా శ్రేణులు ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారిపై బైఠాయించి నినాదాలు చేశాయి. పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపారు. చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు తెదేపా కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వైకాపా శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని పోటా పోటీగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైకాపా శ్రేణులు నినాదాలు చేస్తుండగా.. అందుకు ప్రతిగా తెదేపా కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గం మొత్తం పోలీసు వలయంలో ఉంది. దీంతో ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు భారీగా మోహరించి చర్యలు చేపట్టారు.
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్యయాత్రకు వెళుతూ చంద్రబాబు మార్గమధ్యలో పెందుర్తి మండలంలో భూసమీకరణ బాధితులతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, పోలీసు అనుమతి నిరాకరించడంతో తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు
















